EPAPER

NTR Devara : ఓవర్సీస్ లో దేవర టికెట్స్ హాట్ కేక్.. అయ్యో ట్రైలర్ తర్వాత సీన్ మారిపోయిందిగా.. రాజమౌళి సెంటిమెంటేనా ?

NTR Devara : ఓవర్సీస్ లో దేవర టికెట్స్ హాట్ కేక్.. అయ్యో ట్రైలర్ తర్వాత సీన్ మారిపోయిందిగా.. రాజమౌళి సెంటిమెంటేనా ?

NTR Devara movie trailer review.. mixed openion: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులలో బాగా హైప్ తెచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది తప్పకుండా ఎన్టీఆర్ దేవర మూవీనే. నిర్మాణ పరంగా ఆలస్యం అయినా ఫస్ట్ లుక్, టీజర్స్, పాటలు సీనిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన గ్లోబల్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. దానికి తోడు కొరటాల శివ దర్శకత్వం కావడం మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ విజయం అందుకుందో తెలిసిందే. కొరటాల శివ తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. కేవలం చిరంజీవితో తీసిన ఆచార్య మూవీ తప్ప. అయినా కొరటాల శివ ఈ సారి కసిమీద ఉన్నారని.. తప్పకుండా దేవర మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారని అభిమానులు నమ్ముతున్నారు.


ఓవర్సీస్ లో రికార్డు బ్రేక్

దేవర ప్రమోషన్స్ కు వచ్చిన హైప్ తో ట్రైలర్ విడుదల కాకుండానే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ టికెట్స్ తో.. వసూళ్లు ఏకంగా వన్ మిలియన్ మార్క్ దాటేసింది. ఓవర్సీస్ లో ఒక తెలుగు సినిమా విడుదలకు ముందే రూ.10 కోట్లు వసూళ్లు చేయడం రికార్డే. టాలీవుడ్ లోనే కాదు ఏకంగా ఇండియాలో నిర్మించిన ఏ మూవీ కూడా ఈ స్థాయిలో రికార్డును దక్కించుకోలేకపోయింది. దీనితో బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా ప్రీ సేల్స్ ద్వారా వన్ మిలియన్ డాలర్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ చిత్రంగా దేవర అరుదైన రికార్డులు క్రియేట్ చేసుకుంది. కేవలం బుకింగ్స్ ఓపెన్ చేసిన ఐదు నిమిషాలలోనే టిక్కెట్లన్నీ హాట్ కేక్స్ గా అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 27న దేవర మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాలేదు.


మిశ్రమ స్పందన

సెప్టెంబర్ 10న దేవర మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అభిమానులు ఎంతో ఆశగా వెయ్యి కళ్లతో ఎదురుచూసిన దేవర ట్రైలర్ పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. యంగ్ టైగర్ అభిమానులకు ఈ ట్రైలర్ తెగ నచ్చేసింది. కానీ మామూలు ప్రేక్షకులు మాత్రం ఈ ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదని పెదవి విరుస్తున్నారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ సూపర్బ్ అంటున్నారు అంతా. ఎన్టీఆర్ గెటప్ ఆయన పాత సినిమాలను గుర్తుకుతెస్తున్నాయంటున్నారు. అయితే ఆంధ్రావాలా సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ మూవీ ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది. ఆంధ్రావాలా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఇప్పుడు మరోసారి డ్యూయల్ రూల్ చేస్తున్న ఎన్టీఆర్ దేవర మూవీపై దాని ప్రభావం ఉంటుందని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గెటప్ కూడా దమ్ము మూవీలో మాదిరిగా ఉందని అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే రాజమౌళి సెంటిమెంట్ కూడా ఒకటి బ్యాడ్ సెంటిమెంట్ గా తయారయింది.

రాజమౌళి సెంటిమెంట్

రాజమౌళి సినిమాలో నటించిన ఏ హీరోకైనా తర్వాత సినిమా ఫ్లాపవుతుంది. ఇప్పుడు అదే సెంటిమెంటు రిపీట్ అవుతుందా అనుకుంటున్నారు. అలాగే కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ఇద్దరూ కూడా ఫ్లాపుల్లో ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటే త్వరలో విడుదల కాబోయే దేవర సినిమా ఓపెనింగ్స్ పై వీటి ప్రభావం పడుతుందేమో అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. కల్కి రికార్డులపై కన్నేసిన దేవర ఆ రికార్డులు బద్దలు కొడుతుందో లేదో అని అనుకుంటున్నారు.

Related News

Vettaiyan : నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే.. ఎవరికి ఎక్కువ అంటే..?

Sarangapani Jathakam : ‘సారంగపాణి’ జాతకం కాదు… ముందు ఇంద్రగంటి, దర్శిల జాతకం మారాలి

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Big Stories

×