India’s Fastest Trains: ఒకప్పుడు మీరు వెళ్లాల్సిన రైలు జీవితకాలం లేటు అంటూ, భారతీయ రైల్వే గురించి సటైర్లే వేసేవారు. అనుకున్న సమయానికి రైళ్లు రావు అని విమర్శించేవారు. కానీ, ఇప్పుడు ఆ అపవాదు పూర్తిగా తొలిగిపోయింది. భారతీయ రైల్వే రోజులు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు నెమ్మదిగా వెళ్లిన రైళ్లు ఇప్పుడు మరింత వేగాన్ని అందుకున్నాయి. కొన్ని రైళ్లు దేశ వ్యాప్తంగా అత్యంత వేగంతో పరిగెడుతున్నాయి. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (న్యూఢిల్లీ – వారణాసి): దేశంలోని అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్. గరిష్టంగా 180 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. ట్రాక్ పరిమితుల కారణంగా, 120–130 కి.మీ/గం వేగంతో నడుస్తుంది. సగటు వేగం గంటకు 96.37 కి.మీ/గం. ఇది కేవలం 8 గంటల్లో 771 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది దశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ గతిమాన్ ఎక్స్ ప్రెస్ (న్యూఢిల్లీ – ఝాన్సీ): 2016లో ప్రారంభించబడిన గతిమాన్ వందేభారత్ కంటే ముందు దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది. ఇది 160 కి.మీ/గం వేగాన్ని చేరుకుంటుంది.
⦿ న్యూఢిల్లీ – భోపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్: దేశంలోని ప్రసిద్ధ రైళ్లలో శతాబ్ది ఒకటి, ఇది 150 కి.మీ/గం గరిష్ట వేగంతో నడుస్తుంది. వ్యాపార, ఉద్యోగ ప్రయాణీకులకు ఈ రైలు ఎంతో ఇష్టమైనది.
⦿ ముంబై – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక రైళ్లలో రాజధాని ఒకటి. ఇది 140 కి.మీ/గం వేగంతో నడుస్తుంది. ప్రీమియం సౌకర్యాలతో, ఇది లగ్జరీ, వేగాన్ని అందిస్తుంది. సుదూర ప్రయాణాన్ని సజావుగా మార్చుతుంది.
⦿ న్యూఢిల్లీ – లక్నో గోల్డెన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్: శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు 140 కి.మీ/గం వేగంతో నడుస్తుంది. దాని వేగం, సౌకర్యాలను ప్రయాణీకులను ఆకట్టుకుంటాయి.
⦿ ముంబై – అహ్మదాబాద్ తేజస్ ఎక్స్ ప్రెస్: తేజస్ ఎక్స్ ప్రెస్ గంటకు 140 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కేవలం 6.5 గంటల్లో 522 కి.మీ దూరాన్ని చేరుకుంటుంది. ఎంటర్ టైన్ మెంట్, CCTV పర్యవేక్షణ, హైక్వాలిటీ ఫుడ్ లాంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
⦿ న్యూఢిల్లీ – సీల్దా రాజధాని ఎక్స్ ప్రెస్: ఈ రైలు గంటకు 135 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. సౌకర్యం, సేవ, సమయపాలనకు ప్రసిద్ధి చెందిన ఈ రైలు ఢిల్లీ – కోల్ కతా ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మార్చుతుంది.
⦿ న్యూ ఢిల్లీ – హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్: 1969 నుంచి ఈ రైలు అందుబాటులో ఉంది. ఇది గంటకు 135 కి.మీ. వేగంతో నడుస్తుంది.
⦿ న్యూ ఢిల్లీ – వారణాసి శివ గంగా ఎక్స్ ప్రెస్: గంటకు 130 కి.మీ. వేగంతో నడుస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ రైలు ఢిల్లీ – వారణాసి ప్రయాణికులకు బెస్ట్ ఆప్షన్ గా ఉంది. వేగం, సమయపాలనకు కేరాఫ్ ఉంటుంది.
⦿ హజ్రత్ నిజాముద్దీన్ – కోట జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్: గంటకు 110 కి.మీ వేగంతో నడుస్తుంది. కానీ, ఇది ప్రయాణీకులకు ఇష్టమైనదిగా ఉంది. దీని చైర్ కార్ సౌకర్యం ప్రయాణీకులకు నచ్చుతుంది.
Read Also: కార్గోపై రైల్వే స్పెషల్ ఫోకస్, గతిశక్తి రైళ్లు వచ్చేస్తున్నాయ్!