BigTV English

Rayadurgam : వైసీపీ టిక్కెట్ మెట్టు గోవిందరెడ్డికే దక్కుతుందా? కాపు రామచంద్రారెడ్డి దారెటు?

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రేసు గుర్రాలు ఎవరు? వైసీపీకి గుడ్ బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు? వైసీపీ టిక్కెట్ మెట్టు గోవిందరెడ్డికి దక్కుతుందా? అసలు పోటీలో నిలిచేదెవరు? ఇప్పుడు రాయదుర్గంలో ఎక్కడ చూసిన ఇదే చర్చ నడుస్తోంది.

ఇటీవలే వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇతర పార్టీలకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈసారి ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఈ నియోజకవర్గంలో 2009, 2019 ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓటమి చవిచూశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిని తానేనంటూ మెట్టు గోవింద రెడ్డి ప్రకటించుకున్నారు. నిజానికి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మరో నాయకుడి కోసం వైసీపీ నాయకత్వం సెర్చింగ్ మొదలుపెట్టింది. ఇంతలో తానే అభ్యర్థిని అంటూ మెట్టు గోవిందరెడ్డి పల్లెల్లో ప్రచారం మొదలుపెట్టేశారు. ఇంతకీ అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదో ఆసక్తిగా మారింది.

మెట్టు గోవిందరెడ్డి 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మెట్టు గోవిందరెడ్డి ఇప్పుడు టిక్కెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ టిక్కెట్ కాలవ శ్రీనివాసులు దక్కడం ఖాయం. మరి కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు? కాంగ్రెస్ లో చేరి షర్మిల వెంట నడుస్తారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×