E-Paper
Advertisement

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?
Advertisement

Hyderabad: మాజీమంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని పిలిచి విచారిస్తున్నారు. కింది నుంచి పైవరకు రోజుకో ఒకర్ని పిలిచి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యరు ఎంపీ అవినాష్‌రెడ్డి.

వివేకానంద కేసు, జోరుగా ఈడీ దర్యాప్తు

మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని పిలిచి విచారిస్తోంది ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. బుధవారం ఈడీ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎంపీని విచారించనున్నారు అధికారులు. వివేకా ఘటనకు ముందు.. వెనుక అంటే 2019 నుంచి బ్యాంకు లావాదేవీలపై స్టేట్‌మెంట్లను సదరు ఎంపీ అందజేశారు. రూ.40 కోట్ల సుపారీతోపాటు ఘటనా ప్రాంతంలో లభించిన ఆధారాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

Advertisement

గతంలో సీబీఐ నుంచి బయటపడినట్టుగానే ఈడీ నుంచి అవినాష్‌రెడ్డి బయటపడతారా? ఏమైనా చిక్కులు తప్పవా? ఇవే ప్రశ్నలు ఆయన కుటుంబ సభ్యులను, వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దూకుడు పెంచింది. ఈసారి కింది స్థాయి నుంచి రోజు తప్పించి రోజు గ్యాప్‌లో ఆ కేసులోని నిందితులను విచారణ పిలిచింది ఈడీ. తొలుత దస్తగిరి, ఆ తర్వాత సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డి, నిన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, బుధవారం ఎంపీ అవినాష్ రెడ్డి వంతైంది.

ఈడీ విచారణతో ఈ కేసు దర్యాప్తు ముగుస్తుందా? లేకుంటే మరో అడుగు ముందుకు వెళ్తుందా? అనేదానిపై వైఎస్ ఫ్యామిలీలో కొత్త టెన్షన్ నెలకొంది. ఎందుకంటే వివేకా హత్య కోసం రూ.40 కోట్ల డీల్ కుదిరిందని నిందితుడు సునీల్ యాదవ్ చెప్పాడు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులు వారేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆగస్టులో అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు చేసి రూ.24 లక్షల నగదు, బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకుంది. అందులో నుంచి కొంత సమాచారం సేకరించినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అవినాష్ రెడ్డి బయటకు వచ్చేవరకు కుటుంబసభ్యులకు టెన్షన్ తప్పదన్నమాట.

Advertisement

ALSO READ: ‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

Related News

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!

Big Stories

Advertisement
×