E-Paper
Advertisement

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు
Advertisement

BJP MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. రెండు కీలక స్థానాల్లో పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థులెవరనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతోపాటు, పార్టీ నేతలు, శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక, రాజకీయ సమీకరణాలతోపాటు గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం చెరో స్థానానికి చెరో త్రిసభ్య కమిటీని పార్టీ ఏర్పాటుచేసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేతృత్వం వహిస్తుండగా కల్యాణ్ నాయక్, వెంకటరమణి సభ్యులుగా ఉన్నారు. అలాగే నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి గాను కమిటీలో భరత్ ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు సభ్యులుగా ఉన్నారు.

ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్ట్ ..

Advertisement

హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో ఉన్న బీజేపీ నగర కార్యాలయం వేదికగా ఈ కమిటీ అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఆయా స్థానాల పరిధిలోని జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర పదాధికారులు, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తూ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నివేదికలను రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తారు. అనంతరం రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలోని స్టేట్ కోర్ కమిటీ ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్ట్ తయారుచేసి జాతీయ నాయకత్వానికి పంపించనుంది. చివరగా జాతీయ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో రెండు స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

పార్టీ నేతలు విస్తృతంగా చర్చ..

Advertisement

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి సుమారు 28 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరిలో ప్రధానంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్, డోకూరి పవన్‌కుమార్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, అమర్‌నాథ్ సారంగుల, గౌతమ్‌రావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటంతో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై పార్టీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సుమారు పది దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పోరెడ్డి కిశోర్‌ రెడ్డి, డాక్టర్ వీ పుల్లారావ్ యాదవ్, ధర్మరావు తదితరులు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలోనూ అభ్యర్థుల రాజకీయ నేపథ్యం, పార్టీకి చేసిన సేవలు, క్షేత్రస్థాయిలో ఉన్న బలాబలాలపై కమిటీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

రాంచందర్‌రావు బరిలోకి దింపితే ఎలా ఉంటుంది..

ఇదిలా ఉండగా మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అభ్యర్థిగా బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపైనా త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం, పట్టభద్రుల్లో ఆయనకు ఉన్న పరిచయాలు, ఎన్నికల్లో గెలుపు అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై పార్టీ నాయకత్వం నుంచి అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇదే సమయంలో నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వంపైనా పార్టీ వర్గాల్లో అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను బరిలోకి దింపితే కలిగే రాజకీయ ప్రయోజనాలు, స్థానికంగా పార్టీకి లభించే మద్దతు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఎవరి పేరుకు మద్దతు లభిస్తుంది?

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీకి అనుకూలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే లక్ష్యంతో బీజేపీ నాయకత్వం ముందుకు సాగుతోంది. ఆశావహుల సంఖ్య, సీనియర్ నాయకుల అభిప్రాయాలు, పార్టీ శ్రేణుల సూచనలు, ఎన్నికల క్షేత్రస్థాయి పరిస్థితులను సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ నాయకత్వం నుంచి ఎవరి పేరుకు మద్దతు లభిస్తుంది? స్థానిక నాయకులు ఎవరికి అనుకూలంగా ఉన్నారు? పట్టభద్రుల ఓటర్లను ప్రభావితం చేయగల సామర్థ్యం ఎవరికి ఉంది? అనే అంశాలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారనున్నాయి. త్రిసభ్య కమిటీ సేకరించిన అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి నివేదించిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో రెండు స్థానాల్లోనూ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం బీజేపీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read: ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Tags

Related News

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×