Trump Tariffs: అక్కడెక్కడో అమెరికాలో ప్రసెడెంట్ ట్రంప్ కొట్టిన సుంకాల దెబ్బ ఇక్కడున్న మన ఆంధ్ర రొయ్యకు బాగా గట్టిగి తగిలింది. భారత దిగుమతులపై ఎగుమతించిన 25 శాతం టారీఫ్ ఏపీలోని ఆక్వా పరిశ్రమను సంక్షోబంలోకి నెట్టింది. ఈ దెబ్బతో రొయ్యల రెట్లు కూడా పతనమైపోయాయి. ఇప్పుడు గనక కేంద్రం జోక్యం చేసుకోకపోతే వేల కోట్ల నష్టపోయే ప్రమాదం ఉంది.
ఏపీ ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ దెబ్బ
అమెరిక ప్రసిడెంట్ ట్రంప్ తీసుకున్న పరస్పర సుంకాల గ్రాడియం తాలుకా ప్రభావం ప్రపంచ దేశాల అన్నింటిపై పడింది. అందులో ఇండియా కూడా ఉంది. అదే ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగానికి కూడా నేరుగా తాకింది. ఇప్పిటికి ఒక పక్క వ్యాధులు.. మరో పక్క రెట్ల పతనం ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వారంగాన్ని ట్రంప్ టారిఫ్ గట్టి దెబ్బకొట్టింది. భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా విధించిన 26 శాతం సుంకం ఈ నెల 9 నుంచి అమల్లోకి రానుంది. దాంతో రోయ్యల ధరలు భారిగా పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కేజీ రొయ్యల ధర రూ. 40కి పడిపోయింది. రొయ్యల దిగుమతిపై 16 శాతం ఉన్న సుంకాన్ని ఒకేసారి 26 శాతినికి పెంచడంతో ఏపీ ఆక్వారంగానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యలు సాగుచేసే వారిపై ప్రభావం అధికంగా ఉండనుంది.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచే భారీగా ఆక్వా ఉత్పత్తులు
ఇండియా నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తుల్లో రోయ్యలు 3వ స్థానంలో ఉంది. ఇందులో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఆక్వా ఉత్పత్తులు ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో లక్షా 20 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల టన్నలు రొయ్యల ఉత్ప్తత్తి అవుతుండగా.. అందులో మూడున్నర లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మెుత్తంగా 18 వేల కోట్ల వ్యాపారంలో విదేశుయుల లావదేవిల వాటే ఎక్కువ.
20,30,40 కౌంట్లు ఉండే రొయ్యలు అమెరికాకు ఎగుమతి
ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో అ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. సాధారణంగా 20,30,40 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. కానీ ఇప్పడు టారిఫ్‌ను సాకుగా చూపి అన్ని కౌంట్లపై కిలోకి 40 దాకా తగ్గించేసారు. కొన్ని చోట్ల కోనుగోల్లు లేవని ట్రేడర్లు కూడా ముందుకు రావట్లేదని రైతులు చేప్తున్నారు. అమెరికా సుంకాల ఎఫెక్ట్ రొయ్యలు సాగుచేసు వారిపైనే కాదు.. ఆక్వా రంగంపై ఆధారపడిన కూలీల ఉపాధిపైనా కూడా దెబ్బకొట్టంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గనుక ఇప్పుడు జోక్యం చేసుకోకపోతే సముద్ర ఆహార పరిశ్రమ సంక్షోభంలో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కదిరి కదం తొక్కాలన్నా.. మడక శిర మడతెట్టాలన్నా..
రొయ్యల సాగు ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్
రొయ్యల సాగు, ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే రంగాల్లో ఆక్వా కూడా ఒకటి. జీఎస్డీపీలో రొయ్యల పరిశ్రమ వాటా 11 శాతంగా ఉంది. అయితే ప్రధానంగా ఈ వాటా ఎగుమతులపై ఆధారపడి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఆత్యధిక మెుత్తంలో ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. దాదాపు 18 లక్షల సీ ఫుడ్స్ ఎగుమతితో 7. 38 బిలియన్ డాలర్ల ఆధాయం సమకూరింది. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 2.37 బిలియన్ డాలర్ల విలువైన 3లక్షల 48 వేల టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులున్నాయి.
భారత ఎగుమతి వాటాలో ఏపీ నుంచి 32 శాతం
ఇది భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఏపీ వాటాలా 35 శాతంగా ఉంది. 2023- 24 నుంచే 4. 88బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి. మన దేశంలో ఎగుమతి అయ్యే అతిపెద్ద మార్కెట్ అమెరికానే.. 40 శాతానికి పైగా రొయ్యలు ఇండియా నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ సముద్ర ఆహార ఉత్పత్తులపై 26 శాతం సుంకం విధించడంతో మన రొయ్య యుఎస్ మార్కెట్ తట్టుకొని పోటీలో నిలిచే అవకాశాలు తగ్గిపోయాయి.