Sugar: శరీరం ఆరోగ్యంగా ఉండటానికి.. సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే.. అది అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. చక్కెర, ఉప్పును అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అత్యంత హానికరం అని చెబుతుంటారు. మరి మీరు చక్కెర తినడం తగ్గించుకుంటే లేదా పూర్తిగా మానేస్తే ప్రయోజనం ఉంటుందా ? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని ఎక్కువగా తినడం వల్ల మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చక్కెర తినడం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది ?
చక్కెర తినడం తగ్గించడం ద్వారా.. కొన్ని రోజుల్లోనే మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చూడటం ప్రారంభిస్తారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా.. ఇది మధుమేహం, బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చక్కెర తినడం మానేయడం ద్వారా.. మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇతర సానుకూల ప్రభావాలు మీ శరీరంలో కనిపిస్తాయి.
ఆహారపు అలవాట్లు:
చక్కెర లేదా దానితో తయారు చేసిన పదార్థాలను తినడం తినడం తగ్గిస్తే.. మీ ఆహారపు అలవాట్లు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. నిజానికి.. శరీరంలోని లెప్టిన్ హార్మోన్ కారణంగా.. మీకు ఆకలిగా అనిపిస్తుంది . ఫలితంగా మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. ఈ హార్మోన్ మనకు ఎప్పుడు తినాలో లేదా ఎప్పుడు ఆపాలో చెబుతుంది.
చక్కెర తినడం తగ్గించడం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ పనితీరు మెరుగుపడుతుందని, ఇది మిమ్మల్ని తక్కువ తినేలా చేస్తుంది. అంతే కాకుండా బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒత్తిడి-ఆందోళన:
ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. మీరు ఎక్కువగా చక్కెర తింటే.. అది ఒత్తిడి, ఆందోళనతో సహా అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
చక్కెర యొక్క అధిక గ్లైసెమిక్ సూచిక మెదడులో వాపును పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. చక్కెర ఎక్కువగా తినడం వల్ల నిరాశ, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మీరు చక్కెర తీసుకోవడం తగ్గిస్తే, ఒత్తిడి-డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
చక్కెర తక్కువగా తినడం లేదా చక్కెరను వదులుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. చక్కెర ఎక్కువగా తినడం వల్ల శరీరంలో (అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్) అనే పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి వేగంగా వృద్ధాప్యం రావడానికి కారణమవుతాయి.
Also Read: డయాబెటిస్‌తో.. ప్రాణాలకే ముప్పు, జాగ్రత్త పడకపోతే అంతే !
మీరు చక్కెరను తగ్గించినా.. మీ చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచుకున్నా.. ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది మీ చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
చక్కెర తింటే మీ బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా మీ శరీరంలోని కొవ్వు పరిమాణం కూడా తగ్గుతుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.