BigTV English

Mudragada – Chandrababu: చంద్రబాబుకు ముద్రగడ వార్నింగ్.. జగన్ మళ్లీ వస్తాడంటూ లేఖ

Mudragada –  Chandrababu: చంద్రబాబుకు ముద్రగడ వార్నింగ్.. జగన్ మళ్లీ వస్తాడంటూ లేఖ

Mudragada – CM Chandrababu: కూటమి సర్కార్ దూకుడుతో వైసీపీలో ఉక్కపోత మొదలైందా? నియోజకవర్గాలకు సరైన ఇన్‌ఛార్జులు దొరక్క ఇబ్బంది పడుతోందా? దాని నుంచి డైవర్ట్ అయ్యేందుకు వైసీపీ ముద్రగడను రంగంలోకి దించిందా? సీఎం చంద్రబాబుకు లేఖ వెనుక ఏం జరిగింది? రెడ్ బుక్ పేరుతో బీభత్సం వద్దని ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


కాపు నేతగా పేరు పొందిన వైసీపీ నేత ముద్రగడ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ నుంచి గట్టిగా మాట్లాడే నేతలు లేకపోవడంతో నేరుగా ఆయనను హైకమాండ్ దించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ముద్రగడ ఓ లేఖ రాశారు.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ప్రస్తావిస్తూ.. మీ పాత రాజకీయ స్నేహితుడు ముద్రగడ అంటూ రాసుకొచ్చారు. ‘1995 టీడీపీలో పని చేశాను అప్పటి మీ పాలనలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు బనాయించలేదు. అందుకే పాత స్నేహితుడంటూ అభివర్ణించానని తెలిపారు. మీ కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బీభత్సం సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. ఇది మంచి పద్ధతి కాద’ని, లోకేష్‌కి విషయం అర్థమైనట్టు చెప్పాలని రాసుకొచ్చారు.


అధికారం.. ఆస్తులు ఎప్పుడు సొంతం కాదని, తిరిగి జగన్ అధికారంలోకి వస్తారన్నది అందులో మరొక పాయింట్. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేయాలని అనుకోలేదన్నారు. దెబ్బతిన్న కార్యకర్తలు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని మనసులోని మాట బయటపెట్టారు.

ALSO READ: తిరుపతి తొక్కిసలాటపై ప్రభుత్వానికి నివేదిక.. ఘటన వెనుక ఆ ఇద్దరే?

మీ కుమారుడు లోకేష్‌ను రెచ్చిపోవద్దని చెప్పండి. రేపటి రోజున జగన్ కచ్చితంగా అధికారంలోకి వస్తారు.. ఆరోజు పరిస్థితులు సవ్యంగా ఉండాలంటే, ఈరోజు మనం ఎలా ప్రవర్తించామనేది తెలుసుకోవాలని లేఖలో ముందస్తు హెచ్చరిక చేశారు ముద్రగడ.

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి-మీరు హుందాగా రాజకీయాలు చేసేవారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. వాటిని లోకేష్‌కి వివరించాలని విన్నవిస్తూ ముగించారు. ఒకవిధంగా చెప్పాలంటే ముద్రగడ ద్వారా సీఎం చంద్రబాబు సర్కార్‌ను వైసీపీ సూచన చేసినట్టు కనిపిస్తోంది.

ఆనాడు వైసీపీలో జరిగిన ఘటనలను ముద్రగడ ఏ మాత్రం ప్రస్తావించలేదు. జగన్ సౌమ్యుడిగా చెప్పుకొచ్చారు. ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. గతంలో 2014-19 సమయంలో అప్పట్లో కూడా సీఎం చంద్రబాబును తొలుత ఈ విధంగానే లేఖ రాశారు ముద్రగడ. ఆ తర్వాత తుని రైలు ఘటన జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన ముద్రగడ ముసుగులో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా అన్న డౌట్ టీడీపీ నేతల్లో మొదలైపోయింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్‌ బుక్‌ని టార్గెట్ చేసుకుంది వైసీపీ. అధినేత జగన్ సైతం పదేపదే ఆ పేరు ప్రస్తావించారు కూడా. ఈ వ్యవహారాన్ని ముద్రగడ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. అసలు రెడ్ బుక్ ఇప్పటివరకు తాను ఓపెన్ చేయలేదని పలుమార్లు చెప్పుకొచ్చారు లోకేష్.

వైసీపీ రూలింగ్‌లో నేతల ఆడగాలపై కూటమి సర్కార్ వచ్చిన తర్వాత దృష్టి పెట్టింది. తొలుత విచారణ చేయిస్తోంది.. ఆ తర్వాత కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు బయటకు వచ్చి బలంగా పార్టీ వాయిస్ వినిపించలేక పోతున్న సంగతి తెల్సిందే.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×