Konstas on Virat Kohli: భారత స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ కి వరల్డ్ క్రికెట్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎన్నో స్టన్నింగ్ నాక్స్ తో కోహ్లీ క్రికెట్ లవర్స్ మనసులు దోచుకున్నాడు. అందరూ ఆటగాళ్లు, జట్లతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ అంటే చాలామంది ఇతర దేశ ఆటగాళ్లు, మాజీలకు కూడా చాలా ఇష్టం.
Also Read: Dhanashree Verma: విడాకుల రూమర్స్ పై స్పందించిన చాహల్ భార్య ధనశ్రీ.. పోస్ట్ వైరల్!
చాలా సందర్భాలలో వీరు విరాట్ కోహ్లీని ప్రశంసిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియా యువ ఆటగాడు విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా కోహ్లీ తన దేవుడని చెప్పి ప్రశంసల వర్షం కురిపించాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా తరపున తొలి టెస్ట్ ఆడిన సామ్ కాన్ స్టాస్ – టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య చిన్న వివాదం తలెత్తిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.
తనకు ఎదురుగా వచ్చిన సామ్ కాన్ స్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీ కొట్టాడు. అనంతరం అతడితో వాగ్వాదానికి దిగాడు. మొదటి ఇన్నింగ్స్ పదవ ఓవర్ అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే మరో ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా, ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరినీ వారించారు. అయితే 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడిపట్ల విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరుపై ఆ సందర్భంలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
కొంతమంది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరుని తప్పుబట్టారు. ఈ ఘటన జరిగి 15 రోజుల తర్వాత ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా యువ ఆటగాడు కాన్ స్టాస్. కోహ్లీ తన దేవుడని కొనియాడాడు. చిన్నప్పటినుండి తనకు విరాట్ అంటే చాలా ఇష్టమని.. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఓ లెజెండ్ అని ప్రశంసించాడు. తాను మాత్రమే కాదు తన కుటుంబం మొత్తం కోహ్లీని ప్రేమిస్తుందని వెల్లడించాడు. అతడితో కలిసి ఆడడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.
Also Read: Martin Guptill Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్
“బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత నేను విరాట్ కోహ్లీతో కాసేపు మాట్లాడాను. ఆయన నాకు ఇన్స్పిరేషన్. అతడు ఓ లెజెండ్. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులు ఆయన పేరును జపిస్తుంటారు. ఆయన ఎప్పుడూ చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. శ్రీలంక టూర్ కి నేను సెలెక్ట్ అయినప్పుడు నాకు విషెస్ తెలియజేశారు. నేను బాగా ఆడాలని విష్ చేశారు. నేను ఆయనకి ఎంత పెద్ద అభిమానినో చెప్పాను” అని తెలిపారు కాన్ స్టాస్. దీంతో ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.