Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లోంచి బయటకు గుప్త కోసం కంగారుగా వెళ్తున్న అనామిక కింద పడబోతుంటే అమర్ వచ్చి పట్టుకుంటాడు. థాంక్యూ సార్ అంటూ చెప్తుంది అనామిక. దీంతో అమర్ చూసుకుని వెళ్లు అనామిక.. నువ్వు బాగానే ఉన్నావా..? ఎందుకో కంగారు పడుతున్నట్టు.. బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నావు అని అడుగుతాడు. దీంతో అనామిక అలాంటిదేం లేదు సార్ అని చెప్తుంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇది కూడా నీ ఫ్యామిలియే అనుకుని షేర్ చేసుకో అనామిక అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. తర్వాత స్వామిజీ మనోహరికి ఫోన్ చేస్తాడు. ఏంటి మనోహరి అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నాయని సంబర పడుతున్నావా..?అని అడుగుతాడు. నేను అనుకున్నవన్ని జరగుతున్నాయని మీకెలా తెలుసు స్వామి అని మనోహరి అడుగుతుంది.
దీంతో నీ జాతకం చెప్తుంది మనోహరి. నీకు శుభ ఘడియలు మొదలయ్యాయి అని చెప్తాడు స్వామిజీ. నాకు శుభ ఘడియలు మొదలైతే చిత్రకు పెళ్లి జరగడం ఏంటి స్వామి.. నా పెళ్లి జరిగితే కదా నాకు శుభ ఘడియలు మొదలైనట్టు అని అడుగుతుంది. ఏమో నీ పెళ్లికి కూడా నీ ప్రయాణం మొదలవుతుందేమో అంటాడు స్వామి.. దీంతో మనోహరి హ్యాపీగా ఏమంటున్నారు స్వామిజీ నాకు అమర్‌కు పెళ్లి జరుగుతుందా..? కానీ ఆ అరుంధతి ఉండగా అదెలా జరగనిస్తుంది అంటూ అనుమానిస్తుంది. అరుంధతి ఉండదు కాబట్టే అది జరుగుతుంది అని స్వామిజీ చెప్తాడు. దీంతో మనోహరి మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామిజీ.. అరుంధతి ఉండదు అంటే ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతుంది. దీంతో స్వామిజీ ఆ అరుందతి పరమాత్మలో కలిసిపోతుంది. ఈ పౌర్ణమి ఆ ఆత్మకు చివరి రోజు. ఆ రోజే ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని చెప్పగానే.. హ్యాపీగా మనోహరి అంటే అరుంధతి ఇక్కడి నుంచి పర్మినెంట్ గా వెళ్లిపోతుందా.. అని అడుగుతుంది.
దీంతో స్వామజీ అవును వెళ్లిపోతుంది అని చెప్పగానే మనోహరి థాంక్యూ స్వామిజీ థాంక్యూ అంటూ కాల్ కట్ చేస్తుంది. అరుంధతి ఈ ఇంటి నుంచి వెళ్లిపోయి చిత్ర చిన్న కోడలుగా వస్తే.. ఇద్దరం కలిసి భాగీని ఈజీగా ఇంట్లోంచి వెళ్లగొట్టొచ్చు ఆ తర్వాత అమర్‌కు నాకు పెళ్లి కాకుండా ఎవ్వరూ ఆపలేరు. అని హ్యపీగా ఫీలవుతూ.. చిత్రకు ఫోన్ చేస్తుంది. చిత్ర నేను ఎప్పుడో ఇంట్లోంచి స్టార్ట్ అయ్యాను అని చెప్తుంది. ఇంకా స్టార్ట్ అయ్యావా..? తొందరగా రా.. పెళ్లికి ముహూర్తం పెట్టించాలి కదా..? అంటుంది. దీంతో చిత్ర రేంటి మను అంత హ్యపీగా ఉన్నావు అని అడుగుతుంది. దీంతో మనోహరి స్వతంత్రం రాబోతుంది చిత్ర నాకు అని చెప్తుంది. అది 1947లోనే వచ్చేసింది కదా అంటుంది చిత్ర. ఏయ్ నేను అంటుంది అరుంధతి నుంచి నాకు స్వతంత్రం రాబోతుంది. అని చెప్పగానే అంటే అరుంధతి వెళ్లిపోబోతుందా..? అని చిత్ర అడుగుతుంది. హ్యాపీగా అవును ఇక మనల్ని ఆపడానికి ఎవ్వరూ లేరు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అని మనోహరి చెప్తుంది. దీంతో చిత్ర అయితే నా ఎంట్రీ.. అరుంధతి ఎగ్జిట్ అన్నమాట సరే నేను వచ్చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తుంది.
మనోహరి కోపంగా అరుంధతి నువ్వు మనిషిగా ఉన్నప్పుడే ఆఖరి సారి నీతో మాట్లాడాలని ఉంది అనుకుంటూ వెళ్లిపోతుంది. బయట గార్డెన్‌లో అనామిక గుప్తకోసం వెతుకుతుంది. ఒక దగ్గర డల్లుగా నిల్చున్న గుప్త దగ్గరకు వెళ్లి అనామిక.. గుప్త గారు ఇవాళ ఏంటో తెలుసా..? ఇవాళ ఏం జరగబోతుందో తెలుసా..? అని అడుగుతుంది. దీంతో గుప్త ఈ రోజు ఏమిటో తెలియును ఏమి జరగబోతుందో తెలియును నీకే ఆలస్యంగా తెలిసింది. పౌర్ణమి ఘడియలు మొదలవుతున్నాయి బాలిక నీవు ఈ శరీరమును విడవవలెను. లేనిచో ఆ బాలిక మరణించును అనిచెప్పగానే.. అయ్యో గుప్త గారు అలా అనకండి అనామికకు ఏమీ కాకూడదు అని చెప్తుంది. అయితే నువ్వు ఈ శరీరం నుంచి బయటకు రావలెను అనిచెప్తాడు గుప్త. దీంతో అనామిక సరే అంటుంది. డల్లుగా వెళ్లిపోతుంది.
తర్వాత అనామిక, అమర్ దగ్గరకు వెళ్లి సార్ నేను జాబ్ మానేద్దామనుకుంటున్నాను అని చెప్తుంది. అనామిక మాటలకు పిల్లలు ఎమోషనల్ అవుతారు. అమ్మలా చూసుకుంటావు అనుకున్నాం కానీ ఇలా అమ్మలా మధ్యలో వదిలేసి వెళ్లిపోతావు అనుకోలేదు అంటుంది అమ్ము.. అమ్ము మాటలకు అనామిక ఏడుస్తుంది. అందరికీ బై చెప్తుంది. పిల్లకు జాగ్రత్త చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?