Nellore Aruna: నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మహిళతో సన్నిహతంగా ఉండడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రౌడీ షీటర్ కు పోలీసులే సహకరించారనే ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలపై పోలీసులు కూడా స్పందించారు. ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సంఘటనకు సంబంధించి ఎక్కువగా విమర్శలు రావడంతో పోలీసులు ఆయన పెరోల్ ను రద్దు చేసిన విషయం తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పెరోల్ ఖైదీ శ్రీకాంత్, అరుణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆ వీడియోలు తీసింది ఎవరు..? అరుణకు తెలిసే ఈ తతంగం అంతా జరిగిందా..? అనే వివరాల గురించి అరుణ మీడియాతో మాట్లాడింది.
ప్లీజ్.. దయచేసి ట్రోలింగ్ చేయకండి..
రౌడీ షీటర్ శ్రీకాంత్ గురించి పలు విషయాలను వెల్లడించింది నిడిగుంట అరుణ. ‘శ్రీకాంత్ టీడీపీ కార్యకర్త. ఆయన ఎన్నో రోజుల నుంచి టీడీపి కోసమే పనిచేశారు. పెరోల్ రద్దు వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఫేస్ బుక్ ఓపెన్ చూసి చూస్తుంటే గుండె పగిలిపోతుంది. నన్ను దయచేసి ట్రోలింగ్ చేయవద్దు. కొలిశెట్టి జగదీష్ అనే ఓ రౌడీ షీటర్ ను నేను ఓ తమ్ముడిగా నమ్మాను. నన్ను వదులుకోమని అతను శ్రీకాంత్ కు కండిషన్ పెట్టాడు. ఆ విషయంలో గొడవ జరిగింది. శ్రీకాంత్ ను జగదీష్ అవమానించేలా మాట్లాడాడు’ అని నిడిగుంట అరుణ చెప్పుకొచ్చింది.
ఆస్పత్రిలో వీడియోల వెనుకు అతని హస్తం ఉంది…
‘నాతో ఉంటానని శ్రీకాంత్ చెప్పడంతో.. జగదీష్ కూటమి నేతలకు తప్పుడు మాటలు చెప్పారు. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి వరకు శ్రీకాంత్ కు ఉన్న సౌకర్యాలను రద్దు చేశారు. శ్రీకాంత్ కూటమిని నమ్ముకున్న కార్యకర్త. కొంతమంది నుంచి నాకు ముప్పు ఉంది. ప్రాణ హానీ గురించి గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదు చేశా. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఈ వీడియోల వెనుక జగదీష్ హస్తం ఉంది’ అని ఆమె మీడియాకు వివరించింది.
దయచేసి.. నా ప్రేమను చంపేయొద్దు…
జగదీష్, జెమిని అనే రౌడీ షీటర్ కలిసి మాపై కుట్ర చేశారు. జైలులో ఉన్న వ్యక్తిపై ఇన్ని కుట్రలు అవసరమా..?. నాకు ప్రాణ హాని ఉంది. నేను ఎవరికీ హాని చేయలేదు. నేను శ్రీకాంత్ కు మాత్రమే ప్రేయసిని. నా ప్రేమను చంపేయొద్దు. ఆస్పత్రిలో వీడియోలు బయటకు రావడం వెనుక జగదీష్ హస్తం ఉంది. జగదీష్, జెమిని అనే రౌడీషీటర్లుు కలిసి మా పై కుట్ర చేశారు. శ్రీకాంత్ పెరోల్ రద్దు వెనుక ఎవరున్నారో నాకు తెలియదు’ అని చెప్పింది.
చిన్నతనంలోనే నాకు కష్టాలు…
చిన్నతనంలో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వివాహం చేసుకున్న కొన్ని రోజులకే నా భర్త చనిపోవడంతో నేను చాలా అవమానాలు పడ్డాను. ఆ తర్వాత నన్ను ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆ సమయంలోనే నాకు శ్రీకాంత్ పరిచయం అయ్యాడు. ఆయన నన్ను చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అందుకే నేను శ్రీకాంత్ ను ప్రేమించడం మొదలు పెట్టాను’ నిడిగుంట అరుణ చెప్పుకొచ్చింది.