Shreyas Iyer : టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అతను అధ్బుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఇక ఐపీఎల్ లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి ఫైనల్ కి తీసుకెళ్లాడ. అలాగే 2024లో కోల్ కోతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా వ్యవహరించి టైటిల్ అందించాడు. అలాగే 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించి రన్నరప్ గా నిలిపాడు. ఇలా ఎన్ని సార్లు ప్రూవ్ చేసుకున్నా.. ఎన్ని రన్స్ కొట్టినా.. ఎన్ని కప్స్ కొట్టినా.. సెలెక్టర్లకు మాత్రం శ్రేయస్ అయ్యార్ మాత్రం కనిపించడు. ఆసియా కప్ టీంలో శ్రేయస్ అయ్యార్ కు చోటు దక్కక పోవడంపై బీసీసీఐ పై క్రికెటర్ లవర్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఇంత మంది ఆటగాడిని ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ఎంపిక చేయలేదు. తాజాగా ఆసియా కప్ కి ఎందుకు ఎంపిక చేయలేదని బీసీసీఐ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : IND W Squad for World Cup 2025 : వరల్డ్ కప్ కోసం టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ప్లేయర్ల లిస్టు ఇదే
బీసీసీఐ పై ఫైర్
టీమిండియా సెలెక్షన్ జరిగే క్రమంలో ఏవేవో రాజకీయాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా శ్రేయాస్ ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి రిమూవ్ చేశారు. కానీ 2024 రంజీ ట్రోఫీలో విజయం సాధించాడు. SMAT 2024 లో విజయం.. 2024 ఐపీఎల్ విజయం, ఇరానీ 2024 ట్రోఫీ, 2025 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, రిటర్న్ సెంట్రల్ కాంట్రాక్ట్ 2024/25, 2025 ఐపీఎల్ లో 604 రన్స్, అత్యధిక స్కోర్ 175 ఇలా టాలెంట్ ఉన్న ఆటగాడిని అస్సలు ఎందుకు సెలెక్ట్ చేయడం లేదని.. బీసీసీఐ పై మండిపడుతున్నారు. గౌతమ్ గంభీర్ పాలిటిక్స్ తో సర్పంచ్ సాబ్ ను తొక్కిపడేశారు. సర్పంచ్ సాబ్ కి ఇంత అన్యాయమా..? అని ఫైర్ అవుతున్నారు.
క్లారిటీ ఇచ్చిన అగార్కర్..
టీ-20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న అక్షర్ పటేల్ ను తప్పించింది బీసీసీఐ. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను అతని స్థానంలో వైస్ కెప్టెన్ ని నియమించింది. చాలా రోజుల నుంచి టీ-20ల్లో టీమిండియాకి దూరంగా ఉన్న గిల్ కి ఏకంగా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ కు మాత్రం మరోసారి మొండిచేయి చూపించింది. 15 మంది సభ్యులతో కూడిన ఆసియా కప్ జట్టులో ఈ ముంబై బ్యాట్స్ మెన్ కి చోటు దక్కలేదు. కనీసం స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో కూడా అయ్యర్ పేరు లేకపోవడం గమనార్హం. ఇక ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి. శ్రేయస్ అయ్యర్ జట్టుకి ఎంపిక కాకపోవడంలో అతని తప్పు ఏం లేదు. అలాగే మా తప్పు కూడా ఏం లేదు. అతడు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఎవరి స్థానంలో అతన్ని తీసుకురావాలో మీరే చెప్పండి..? అని మీడియాని ప్రశ్నించారు అగర్కార్. జట్టులో 15 మందికి మాత్రమే స్థానం ఉందని.. అందుకే శ్రేయస్ ని తీసుకోలేకపోయామని స్పష్టం చేసారు.
– Most Runs in Champions Trophy
– More Runs than Shubman Gill in WC
– Reached IPL Finals being Top Run Scorer of TeamGautam Gambhir is just jealous of him. There is not even a single reason to drop Shreyas Iyer. pic.twitter.com/ogknDVE3mS
— Selfless⁴⁵ (@SelflessCricket) August 19, 2025