BigTV English

Nara Chandrababu Naidu : ఏఐజీ నుంచి చంద్రబాబు డిశ్చార్జ్.. ఏ టెస్టులు చేశారంటే?

Nara Chandrababu Naidu : ఏఐజీ నుంచి చంద్రబాబు డిశ్చార్జ్.. ఏ టెస్టులు చేశారంటే?

Nara Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్య పరీక్షల కోసం గురువారం గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో ఆయన చేరారు . పరీక్షలు పూర్తైన తర్వాత ఏఐజీ వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు. ఈ సమయంలో చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి ఉన్నారు.


ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబును గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్‌ కే రాజేష్‌ ఆధ్వర్యంలో పరీక్షించారు. జనరల్‌ మెడిసిన్‌, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత వివిధ వైద్య పరీక్షలు సూచించారని తెలుస్తోంది. ఈసీజీ, 2డీ ఎకో, రక్త, మూత్ర పరీక్షలు కాలేయ, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, అలర్జీ స్క్రీనింగ్‌ టెస్టులు చేశారని సమాచారం. జైలులో ఉన్న సమయంలో చంద్రబాబు తీవ్ర అలర్జీతో బాధపడ్డారు. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు మధ్యంతర బెయిల్‌ వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ తర్వాత ఏఐజీలో చేరారు.

ఏఐజీ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చంద్రబాబు వెళ్లతారని తెలుస్తోంది.అక్కడే కంటి వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని సమాచారం.


Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×