BigTV English

Chandrababu : “రా.. కదలి రా”.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బాబు పిలుపు..

Chandrababu : “రా.. కదలి రా”.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బాబు పిలుపు..

Chandrababu : కనిగిరిలో “రా.. కదలి రా” కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చంద్రబాబుకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నుంచి కాపాడేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యువగళం ముగింపు సభకు వచ్చినట్టుగా నేడు ప్రజలు ఈ కార్యక్రమానికి వచ్చారన్నారు.


ప్రకాశం గడ్డ పౌరుషాల గడ్డ అందుకే “రా.. కదలి రా ” కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయని. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఈ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలంతా కలిసి పోరాడాలన్నారు . వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం వచ్చిందన్నారు.

తొమ్మిది సార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి సంపద సృష్టించడం రాదని విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఖజనా నింపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా విచ్చలవిడి‌గా జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.


ఐదు కోట్ల ప్రజలు భవిష్యత్ తనపై ఆధారపడి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఐదేళ్లు నరకం అనుభవించామన్నారు. సమస్యలపై పోరాడితే కేసులు పెడుతున్నారన్నారు. ఎక్కువ నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని జాతీయ సర్వేలు చెప్తున్నాయని గుర్తుచేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలను బదీలీలు చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్లమంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేస్తామన్నారు. బీసీలను అభివృద్ధి పరిచే బాధ్యత తమ పార్టీ తీసుకుంటుంది అని ప్రకటించారు. మైనార్టీలకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రమంతా జగన్ భాధితులే అని విమర్శించారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×