Big Stories

Band Aid Politics : బ్యాండెయిడ్ రాజకీయం.. అన్నకు సలహా.. కోడికత్తి కమలహాసన్ అంటూ లోకేశ్ ట్వీట్

Band Aid Politics in AP : ఏపీలో రాజకీయం ఇప్పుడు సీఎం జగన్ తలకు ఉన్న బ్యాండెయిడ్ చుట్టూ తిరుగుతోంది. ఈ నెల 13న జగన్ తలకు రాయి తగలడంతో దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వైద్యులు చికిత్స చేసి రెండు కుట్లు వేసి బ్యాండెయిడ్ వేశారు. అప్పటి నుంచి జగన్ ఎక్కడికెళ్లినా.. బ్యాండెయిడ్ తోనే వెళ్తున్నారు. దీంతో బ్యాండెయిడ్ పై చర్చ మొదలైంది. దెబ్బతగిలి 13 రోజులైనా ఇంకా తగ్గలేదా ? చిన్న దెబ్బకు ఇంకా బ్యాండెయిడ్ వేయాల్సి అవసరం లేదు అని కొందరు అంటున్నారు.

- Advertisement -

తాజాగా దీనిపై వివేకా కుమార్తె, జగన్ సోదరి డాక్టర్ సునీత స్పందించారు. ఒక వైద్యురాలిగా అన్నకు బ్యాండెయిడ్ పై సలహా ఇచ్చారామె. ఇన్నిరోజులు బ్యాండెయిడ్ ఉంచితే అది సెప్టిక్ అవుతుందని, వెంటనే దానిని తీసివేయాలని సూచించారు. గాయానికి గాలి తగిలితేనే త్వరగా మానుతుందని వైద్యురాలిగా చెబుతున్నానన్నారు. అయితే.. ప్రతిపక్షాలు జగన్ బ్యాండెయిడ్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు చేస్తుండగా.. సునీత నిజంగానే సలహా ఇచ్చిందా లేక అన్నపై సెటైర్ వేసిందా అన్న చర్చ జరుగుతోంది.

- Advertisement -

Also Read : రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?

ఇదిలా ఉంటే.. సునీత ఇచ్చిన సలహా వీడియోను నారా లోకేష్ X లో షేర్ చేస్తూ.. జగన్ పై సెటైర్లు వేశారు. కోడికత్తి కమలహాసన్ ఆ బ్యాండేజ్ ను ఎలక్షన్ అయ్యాకే తీస్తాడని, ఇదే తన ఛాలెంజ్ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా సెటైర్లు పేలుస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News