BigTV English

Rajat Patidar: రజత్.. అలా ఎలా నాలుగు సిక్సర్లు కొట్టావ్? ఫిధా అవుతున్న నెటిజన్లు

Rajat Patidar: రజత్.. అలా ఎలా నాలుగు సిక్సర్లు కొట్టావ్? ఫిధా అవుతున్న నెటిజన్లు

Rajat patidar IPL 2024 news(Sports news headlines): ఐపీఎల్ లో మొన్నటివరకు ఆర్సీబీ జట్టు పేలవమైన ప్రదర్శన కొనసాగింది. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ ప్లేయర్లపై రకరకాల విమర్శలు వినిపించాయి. అయితే లక్కీగా కొహ్లీ తన ఆట తను ఆడి, ట్రోలర్స్ బారి నుంచి బయటపడ్డాడు. కాకపోతే మరీ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో వచ్చే రజత్ పటీదార్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.


సీజన్ లో ఇలాంటి ఆటగాడు ఒక్కడుంటే చాలు, ఆ జట్టు షెడ్డుకి వెళ్లడం ఖాయం, ఇంకా ఎన్నాళ్లు ఇతన్ని భరిస్తారంటూ ఆర్సీబీ అభిమానులు గట్టిగానే కామెంట్లు చేశారు. నిజానికి ఐపీఎల్ 2021లో అరంగేట్రం చేసిన రజత్.. ఆ సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే ఆ తర్వాతి సీజన్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో కేవలం 8 మ్యాచ్‌ల్లో 333 పరుగులు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

అయితే గాయం కారణంగా ఐపీఎల్ 2023 పూర్తిగా దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టులోకి తిరిగొచ్చిన రజత్, ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 211 పరుగులు చేశాడు. ఇప్పటివరకు కొంత నిరాశజనకంగా తన ఆటతీరు సాగింది. నిర్లక్ల్యపు షాట్లతో వికెట్లు పారేసుకుంటున్నాడనే విమర్శలు మిన్నంటాయి. అయితే వాటన్నింటిని పటా పంచాలు చేస్తూ ఒక్కసారి ఐపీఎల్ అభిమానులందరినీ తన వైపునకు రజత్ తిప్పుకున్నాడు.


Also Read: పంజాబ్ కింగ్స్ పరువు నిలబెట్టుకుంటుందా? నేడు కోల్ కతా తో మ్యాచ్

అది కూడా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 11వ ఓవర్‌లో రజత్ పాటిదార్ విశ్వరూపం చూపించాడు. మయాంక్ మార్కండే బౌలింగ్ లో వ‌రుస‌గా  6,6,6,6  సిక్సర్లు బాదాడు.  అద్భుత‌మైన షాట్స్ కొడుతూ రికార్డు హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఇందులో 2 ఫోర్లు, ఓవరాల్ గా 5 సిక్స‌ర్లు ఉన్నాయి.

మయాంక్ మార్కండే బౌలింగులో కొట్టిన సిక్సర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలా ఎలా కొట్టావ్? అని నెటిజన్లు అడుగుతున్నారు. ఒకటి లాంగ్ ఆన్ మీదుగా, ఒకటి మిడ్ వికెట్ మీదుగా, ఒకటి ఎక్స్ ట్రా కవర్ మీదుగా, ఒకటి లాంగ్ ఆఫ్ మీదుగా నాలుగు డిఫరెంట్ స్టయిల్స్ లో కొట్టాడు. అంటే మయాంక్ కూడా నాలుగు బంతులను వైవిధ్యంగానే వేశాడు. అంతే వైవిధ్యంగా రజత్ కూడా వాటిని సిక్సర్లుగా మలిచాడు.

దీంతో  ఇప్పుడు రజత్ టెక్నిక్, అతని బ్యాటింగ్ నైపుణ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. అంతేకాదు స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో రజత్ పాటిదార్ సామర్థ్యం ఇప్పుడు బయట ప్రపంచానికి తెలిసింది. ఈ ఒక్క ఓవర్ గేమ్ ఛేంజర్ గా మారిందని  అంతా అంటున్నారు. లేదంటే హైదరాబాద్ సులువుగా గెలిచేదని కామెంట్ చేస్తున్నారు.

నిన్నటి వరకు రజత్ ని తిట్టిన వారందరూ నేడు అదే నోళ్లతో పొగుడుతున్నారు. ఇదే లోకం తీరు అంటే అని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాళ్లు వేసే చేతులతోనే పూలు కూడా వేస్తారని గుర్తు చేస్తున్నారు.

Tags

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×