Big Stories

Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. విచారణకు హాజరైన నారా లోకేష్

Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ టీడీపీ నేత నారా లోకేష్ ను విచారిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతోంది. నారా లోకేష్ సీఐడీ విచారణ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో తాడేపల్లిలోని SIT కార్యాలయం వద్ద ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు దశల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు, సిట్‌ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి.

- Advertisement -

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్ ను A-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. లోకేష్‌ను CRPC లోని సెక్షన్ 41A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఏపీ హైకోర్ట్‌కు చెప్పింది. ఈ మేరకు ఈ నెల 4న తొలుత లోకేష్‌ ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు పంపింది. ఈ నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని కోరింది. ఈ నిబంధనలను నారా లోకేష్ ఏపీ హైకోర్ట్‌లో సవాల్‌ చేయగా.. వాదనల అనంతరం బుక్స్ కోసం లోకేష్‌పై ఒత్తిడి చేయవద్దని సీఐడీని ఆదేశింస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News