BigTV English

Nara Lokesh: ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh: ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh Fire on IIIT Ganja Issue(AP news live): ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆయన్ను కలిశారు. తమ పిల్లల్ని అక్కడ చేర్పించి నష్టపోతున్నామంటూ వాపోయారు. క్యాంపస్‌ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదు చేశారు.


ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌కు గంజాయి విషయంపై చొరవ తీసుకొని తమ పిల్లలను కాపాడాలని తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. తమ పిల్లలను ట్రిపుల్ ఐటీలో చేర్పించి నష్టపోతున్నామంటూ వాపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు.

గంజాయి సమస్యలను పరిష్కరించి విద్యార్థులను భవిష్యత్ కాపాడుతానని మంత్రి హామీ ఇచ్చారు. గంజాయిని విక్రయించే రాజకీయ నాయకులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలతోపాటు కళాశాలల పరిసరాల్లో నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. గంజాయి నిర్మూలన ధ్యేయంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు.


Also Read: కడప ఉపఎన్నిక చిచ్చు.. జగన్‌‌కు ఇంటిపోరు మొదలైందా?

కాగా, ట్రిపుల్ ఐటీలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి గంజాయి, సిగరెట్ ప్యాకెట్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ అన్నమయ్య జిల్లా గాలివీడు, నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ నెల 3న కడప వెళ్లిన వీరిద్దరూ అదే రోజున ట్రిపుల్ ఐటీకి తిరిగొచ్చారు. అనుమానం వచ్చిన వీరిద్దరిని తనిఖీ చేయగా గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు దొరికాయి.

ఇదిలా ఉండగా.. మరో ట్రిపుల్ ఐటీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్కువమంది ఫెయిల్ అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు పదో తరగతిలో 90శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు సైతం ఫెయిల్ అవుతున్నారని వాపోయారు. ఇంటర్‌లో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కూడా మంత్రి లోకేష్ స్పందించి.. సమస్యను తెలుసుకొని పరిష్యరిస్తామని హామీ ఇచ్చారు.

Related News

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Minister Lokesh: రియల్ టైమ్ గవర్నెన్స్‌లో మంత్రి లోకేష్.. నేపాల్‌లో తెలుగువారితో వీడియో కాల్

AP Govt Plan: ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై నో ఆఫీసు, నేరుగా ఇంటికే

Big Stories

×