BigTV English

Nara Lokesh: అర్థమైందా రాజా.. ఆ వైసీపీ నేతలపై లోకేష్ పంచ్‌లు, పాపం ఏమైపోతారో!

Nara Lokesh: అర్థమైందా రాజా.. ఆ వైసీపీ నేతలపై లోకేష్ పంచ్‌లు, పాపం ఏమైపోతారో!

టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో నారా లోకేష్ వైసీపీ నేతలపై పంచ్ లు విసిరారు. అయితే ఆయన ఎవరి పేరు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఆయన మాటలు వింటే మాత్రం లోకేష్ టార్గెట్ ఎవరనేది ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారుని, అసలు రెడ్ బుక్ గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు లోకేష్. “రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తుంది. కొంతమంది బాత్ రూం లో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. అర్దం అయ్యిందా రాజా.” అంటూ పరోక్షంగా కొడాలి నాని, పెద్దిరెడ్డికి జరిగిన సంఘటనలను ప్రస్తావించారు.


గుండెపోటు..
ఇటీవల కొడాలి నానికి గుండెపోటు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ బుక్ లో నెక్స్ట్ ఆయన పేరే ఉందని, అందుకే ఆయన గుండెపోటు డ్రామా ఆడుతున్నారంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. అయితే వైసీపీ మాత్రం ఆయన అనారోగ్యంపై రాజకీయమేంటని బదులిచ్చింది. ఆయనకు గుండెపోటు రాలేదని, కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరారని వివరణ ఇచ్చింది. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూమ్ లో జారి పడటం వల్ల చేతికి కట్టుకట్టారు. ఆ కట్టుతోనే ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయన కూడా లిస్ట్ లో ఉన్నారని, అందుకే అనారోగ్యం అని సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ టీడీపీ నేతలంటున్నారు. ఈ రెండు సంఘటనలను పరోక్షంగా లోకేష్ ప్రస్తావించడంతో ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కార్యకర్తలు ఈలలు వేసి గోల చేశారు. లోకేష్ పంచ్ డైలాగులతో సభా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు కార్యకర్తలు.

గల్లీ – ఢిల్లీ
మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు – ఢిల్లీ పాలిటిక్స్ తెలుసని చెప్పారు లోకేష్. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినాకూడా ఎప్పుడూ దాన్ని స్వార్ద రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేదని వివరించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయడంలో టీడీపీ కృషి ఉందని, బాలయోగి గారిని లోక్ సకు మొదటి దళిత స్పీకర్ ని చేసింది కూడా తమ పార్టీయేనని, అంబేద్కర్‌ కి భారతరత్న రావడంలో కూడా టీడీపీ కీలకపాత్ర పోషించిందన్నారు.



జెండా పీకేస్తారట..
తెలుగు దేశం జెండా పీకేస్తామని కొంతమంది వచ్చారని, అలాంటివారిప్పుడు అడ్రెస్ లేకుండా పోయారని అన్నారు లోకేష్. 2019 వరకు మనం చూసిన రాజకీయం వేరని, 2019 నుండి 2024 వరకు మనం చూసిన రాజకీయం వేరు అని అన్నారాయన. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను ఎదుర్కొన్నామని చెప్పారు. దేవాలయంగా భావించే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డామన్నారు. .పార్టీ అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామని గుర్తు చేశారు.క్లెమోర్ మైన్ల కే భయపడని బ్లడ్ మనది అని, అలాంటిది మనం కామెడీ పీసులకు భయపడతామా? అని ప్రశ్నించారు లోకేష్.

మాజీ సీఎం జగన్ పై కూడా పరోక్షంగా సెటైర్లు పేల్చారు లోకేష్. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అని సెటైర్లు వేసిన వారికి.. ప్రతిపక్ష హోదాయే లేకుండా ఇంటికి పంపించామన్నారు. గత ఎన్నికల్లో ప్యాలెస్ లు బద్దలు కొట్టామన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ స్ట్రైక్ రేట్ 94 శాతం అని చెప్పారు. 58 శాతం ఓట్ షేర్ తో 8 ఉమ్మడి జిల్లాలను క్లీన్ స్వీప్ చేశామన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించామని చెప్పారు లోకేష్.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×