BigTV English

Techie Wife Murder: భార్యను చంపి.. తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే.. తప్పు ఆమెదేనా? సూట్‌కేస్ కేసులో కొత్త ట్విస్ట్!

Techie Wife Murder: భార్యను చంపి.. తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే.. తప్పు ఆమెదేనా? సూట్‌కేస్ కేసులో కొత్త ట్విస్ట్!

Bengaluru Techie Wife Murder| పెద్దలను ఎదిరించి ప్రేమించుకున్నారు. ఎవరు కాదన్నా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి కొన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. అంతగా ప్రేమించిన భార్యను ఆ భర్త హత్య చేశాడు.అయితే హత్య చేసినందుకు పశ్చాత్తాపంతో తాను కూడా చనిపోదామని భావించి విషం తాగాడు. విషం పుచ్చుకున్నాక పోలీస్ స్టేషన్ వెళ్లి తన నేరాన్ని అంగీకరించాడు. అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది ఇటీవల బెంగుళూరు లో ఒక సాప్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్యను హత్య చేసిన కేసులో వివరాలు. అయితే ఈ కేసులో అసలు విషయం బయటపడలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను అతను ఎందుకు చంపాడు. అనేది ఇంకా స్పష్టం కాలేదు.


అయితే ఈ కేసులో నిందితుడి తండ్రి అన్ని విషయాలు వివరంగా పోలీసులకు, మీడియాకు తెలిపారు. నిందితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లోని పుణెకి చెందిన రాకేష్ ఖెడేకర్ కు తన మేనత్త కూతరు గౌరి అంటే ఎంతో ఇష్టం. గౌరి కూడా రాకేష్ ని ప్రేమిచింది. పెద్దలకు తెలియకు వీరిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నాక.. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకరించలేదు. ఉత్తర భారతదేశంలో మేనమామ, మేనత్త పిల్లలను కూడా అన్నా, చెల్లెళ్లుగానే భావిస్తారు. దక్షిణ భారతదేశం లాగా అక్కడ మేనరిక సంబంధం ఉంటే బావ, మరదలు అని భావించడం జరగదు. అందుకే వారి పెళ్లికి అక్కడి సంప్రదాయం ఆటంకంగా మారింది.

Also Read: హిజ్రాల బీభత్సం.. డబ్బులు ఇవ్వలేదని ట్రైన్‌లో యువకుడి హత్య


అయినా రాకేష్, గౌరి మొండిగా తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. గౌరికి పెళ్లి సంబంధాలు వచ్చినా ఆమె నిరాకరించింది. మరోవైపు రాకేష్ కు ఒక ఐటి ఉద్యోగం లభించింది. అలా నాలుగేళ్ల తరువాత చివరికి పెద్దలు విసిగిపోయి, వారివురి ప్రేమను అంగీకరించి పెళ్లిచేసారు. రాకేష్ బెంగుళూరులో ఐటి ఇంజినీర్ గా జాబ్ చేస్తుండగా.. గౌరి కూడా మాస్ కమునికేషన్స్ డిగ్రీ ఉండడంతో ఆమె కూడా జాబ్ చేసేది. కానీ ఇటీవల ఆమె ఆఫీసులో గొడవ పడి జాబ్ మానేసింది.

గౌరికి త్వరగా కోపం వచ్చేదని.. ఆమె కోపం వస్తే.. హింసాత్మకంగా దాడులు చేస్తుందని రాకేష్ తండ్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల గౌరి, రాకేష్ మధ్య ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది. అయితే గౌరి ఆ గొడవతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన రాకేష్ ఆమె ప్రవర్తన పట్ల కోపగించుకొని.. తను కూడా వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే గౌరి ఇంట్లో ఉన్న ఒక పదునైన కత్తి తీసుకొని రాకేష్ పై దాడి చేసింది. అయితే రాకేష్ ఆమె దాడిని ఎదుర్కొని ఆ కత్తితో ఆమెనే పొడిచేశాడు. చూస్తుండగానే గౌరి తన ప్రాణాలు విడిచింది. గౌరి చనిపోగానే భయపడిపోయిన రాకేష్ ఈ విషయాల్ననీ తన తండ్రికి ఫోన్ చేసి తెలిపాడు. తాను ప్రేమించిన గౌరిని తనే చంపుకున్నానని ఏడుస్తూ.. తాను ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. అప్పుడు రాకేష్ తండ్రి.. అలా చేయకు.. పోలీస్ స్టేషన్ వెళ్లి సరేండర్ చేయమని సలహా ఇచ్చారు.

అయితే పోలీస్ స్టేషన్ వెళ్లే ముందు రాకేష్ ఒక పాయిజన బాటిల్ కొన్నాడు. పోలీస్ స్టేషన్ లోపల ప్రవేశించే ముందు విషం తాగి లోపలికి వెళ్లాడు.అక్కడ పోలీసులకు జరగినదంతా చెప్పాడు. అలా చెబుతూనే స్పృహ తప్పిపడిపోయాడు.ప్రస్తుతం రాకేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసులు అతని హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Related News

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Big Stories

×