Nara Lokesh vs YS Jagan: మాజీ సీఎం జగన్ చేసిన 2.O కామెంట్స్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బుధవారం జగన్ మాట్లాడుతూ.. ఇకపై జగన్ 2.O చూస్తారని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై లోకేష్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఢిల్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో.. లోకేష్ చిట్ చాట్ గా మాట్లాడారు.
లోకేష్ దృష్టికి జగన్ చేసిన కామెంట్స్ ను మీడియా ప్రతినిధులు తీసుకువచ్చారు. దీనితో లోకేష్ స్పందిస్తూ.. జగన్ వన్ పాయింట్ ఓ తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రం వన్ పాయింట్ ఓ నుండి బయటపడేందుకు కనీసం 30 ఏళ్లు పట్టే సమయం ఉన్నట్లు లోకేష్ అన్నారు. మళ్లీ 2.O ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో దళితులను, బడుగు బలహీన వర్గాల వారిని, మైనారిటీ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఇష్టారీతిన కేసులు నమోదు చేసి, ఇతర పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసిన విషయం ఇంకా ఎవరు మర్చిపోలేదంటూ లోకేష్ అన్నారు.
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు ఓవైపు సంక్షేమ పథకాలను అందుకుంటూ.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారన్నారు. అలాగే వైయస్ జగన్ భద్రత విషయంలో స్పందించిన లోకేష్.. జగన్ కుటుంబంలో ఎవరికి భద్రత తగ్గించలేదని, నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నామన్నారు. తనపై కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో 23 కేసులు నమోదు చేశారని, అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసును కూడా నమోదు చేసినట్లు లోకేష్ తెలిపారు.
Also Read: Pawan Kalyan: రేపటి కేబినెట్ సమావేశానికి పవన్ గైర్హాజరు.. కారణం ఇదే!
ఇక జగన్ మరో మారు తన వెంట్రుకలు పీకలేరంటూ చేసిన కామెంట్స్ పై లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు జగన్ ఇదే రీతిలో నంద్యాల బహిరంగ సభలో ప్రసంగించారని, ఆ తర్వాత వచ్చిన ఫలితాలే ఆ కామెంట్స్ కి సమాధానమిచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం చట్టానికి అనుగుణంగా నడుచుకుంటుందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ మాఫియా పై పూర్తి విచారణ సాగుతుందన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు అధికంగా జరిగాయని, వాటిపై కూడా విచారణ సాగుతుందని లోకేష్ తెలిపారు.