Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు జరిగే కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందుకు గల కారణాలను కూడ ప్రకటన ద్వార తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేడుకల అనంతరం, పలు సమీక్ష సమావేశాలకు పరిమితమయ్యారు. అయితే అప్పటి నుండే పవన్ కొంత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. రిపబ్లిక్ డే ముందు వరకు పవన్ వరుస పర్యటనలు సాగించారు. అలాగే తన కార్యాలయంలో వరుస సమీక్షకు నిర్వహించారు. ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ వరుస సమీక్షలను కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పవన్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సలహా మేరకు పవన్ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో గురువారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరు కావాల్సి ఉంది. అసలే పవన్ అస్వస్థతకు గురి కావడంతో, కేబినెట్ మీటింగ్ కి హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకే డిప్యూటీ సీఎం కార్యాలయం ముందస్తుగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని, జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు కూడ పవన్ ను బాధ పెడుతున్నట్లు ప్రకటించింది.
Also Read: YS Jagan 2.O: జగన్ నోట సూపర్ స్టార్ మాట.. జగన్ 2.o చూపిస్తానంటూ ప్రకటన
వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. తగిన విశ్రాంతి అవసరమని సూచించారట. అందుకే రేపు జరిగే కేబినెట్ సమావేశానికి పవన్ గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. పవన్ హాజరు కాకపోతే, పలు వార్తలు హల్చల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ ప్రకటన వచ్చిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే పవన్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న జనసేన నాయకులు, పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.