BigTV English

Vande Bharat Sleeper Trains: 50 వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఇది కదా అదిరిపోయే న్యూస్ అంటే!

Vande Bharat Sleeper Trains:  50 వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఇది కదా అదిరిపోయే న్యూస్ అంటే!

Vande Bharat Sleeper Trains News:  భారతీయ రైల్వేలోకి సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కనున్న నేపథ్యంలో.. మరో సూపర్ న్యూస్ చెప్పింది. వచ్చే రెండేళ్లలో ఏకంగా 50 వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 2025-2027 మధ్య కాలంలో 50 వందే భారత్ స్లీపర్ రైలు సెట్లను తయారు చేయాలని భావిస్తున్నది. వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన తొలి రేక్ పరీక్ష దశలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల కానుంది.


24 కార్లతో 50 వందేభారత్ స్లీపర్ రైళ్లు

రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 24 కార్ల కాన్ఫిగరేషన్ లో 50 స్లీపర్ వెర్షన్ రేక్‌ లను ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. “వందే స్లీపర్ వెర్షన్ కు సంబంధించి తొలి రేక్ పరీక్ష దశలో ఉంది. ఇంకా, 24-కార్ల కాన్ఫిగరేషన్‌ లో 50 స్లీపర్ వెర్షన్ రేక్‌లను 2025- 27లోగా తయారు చేయాలని ప్రణాళికలు రూపొందించాం” అని రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారతీయ రైల్వే ఉత్పత్తి కేంద్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి 200 రేక్‌ లను తయారు చేయాలని యోచిస్తోంది. వీటిలో కైనెట్ రైల్వే సొల్యూషన్స్ లిమిటెడ్ 120 వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ సెట్లను తయారు చేస్తుంది. మిగిలిన 80 టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (BHEL) కన్సార్టియం ద్వారా ఉత్పత్తి చేయనున్నారు.


Read Also: జమ్మూ- శ్రీనగర్ రూట్ లో పరుగులు తీసే తొలి రైలు వందే భారత్ కాదా? ఇదీ అసలు కథ!

అద్భుతమైన లుక్ తో వందే భారత్ స్లీపర్

వందే భారత్ స్లీపర్ రైలు సెట్ చూడ్డానికి చాలా అందంగా రూపొంది. రైలు సెట్‌ లో ఉపయోగించే అన్ని పదార్థాలు, భాగాలు అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ అందంతో పాటు అత్యాధునిక భద్రత, సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అద్భుతమైన ఇంటీరియర్‌ లతో రూపొందించబడింది. వందేభారత్ స్లీపర్ రైలు యూరోపియన్ ప్రమాణాలకు సమానంగాప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలులో ప్రపంచ స్థాయి ఫీచర్లు ఉన్నాయి.

⦿ ఆస్టెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ తో తయారు చేసిన రైలు సెట్

⦿ ప్రయాణీకుల భద్రత కోసం రైలు సెట్‌ లో క్రాష్- వాల్యూ ఫీచర్లు

⦿ GFRP ప్యానెల్స్ తో  హై క్లాస్ ఇంటీరియర్స్

⦿ ఏరోడైనమిక్ అవుట్ లుక్

⦿ మాడ్యులర్ ప్యాంట్రీ

⦿EN 45545 ఫైర్ రెసిస్టెంట్

⦿ ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లు

⦿ ఆటోమేటిక్ డోర్లు

⦿ సెన్సార్ ఆధారిత ఇంటర్‌ కమ్యూనికేషన్ డోర్లు

⦿ స్మెల్ రాని టాయిలెట్ వ్యవస్థ

⦿ డ్రైవింగ్ సిబ్బంది కోసం టాయిలెట్

⦿ 1వ AC కార్ లో వేడి నీటితో షవర్ సౌకర్యం

⦿ USB ఛార్జింగ్ సదుపాయంతో ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్

⦿పబ్లిక్ అనౌన్స్‌ మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్

⦿ ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు

⦿విశాలమైన లగేజ్ గది

⦿ అత్యంత వేగం

Read Also: కుంభమేళాకు ఫ్రీ రైళ్లు.. టికెట్ లేకుండానే వెళ్లొచ్చు, కానీ ఓ కండీషన్!

Related News

Vande Bharat Trains: హైదరాబాద్ కు 2 కొత్త వందే భారత్ రైళ్లు.. శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ స్థానంలో రీ ప్లేస్!

Water on Coal: రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?

Moscow – Indian Tourists: భారత పర్యాటకులకు మాస్కో సాదర స్వాగతం, కారణం ఏంటో తెలుసా?

Benefits of Train Ticket: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!

Vande Bharat: వందేభారత్ లో తాగి రచ్చ చేసిన జంట, RPF సిబ్బంది ఏం చేశారంటే?

Goa history: ఏంటీ.. గోవాలో ఉన్నది రెండే జిల్లాలా? వీటిలో ఏది బెస్ట్?

Tourist Footfall: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?

Islands In India: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!

Big Stories

×