Mawra Hocane: హీరోహీరోయిన్లు తమ కెరీర్ మొత్తంలో ఎన్ని సినిమాలు చేసినా.. వారిని మాత్రం ఒక స్పెషల్ సినిమా రూపంలోనే గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు. అలాంటి స్పెషల్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సనమ్ తేరీ కసమ్’. మామూలుగా బాలీవుడ్‌లో యాక్షన్, కమర్షియల్ సినిమాలే ఎక్కువ. లవ్ స్టోరీలు రావు అనే భావనలో ప్రేక్షకులు ఉంటారు. కానీ ‘సనమ్ తేరీ కసమ్’ మాత్రం బాలీవుడ్ హిస్టరీలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. అందులో హీరోహీరోయిన్‌గా నటించిన హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకేన్ కూడా అందరికీ గుర్తుండిపోయారు. తాజాగా మావ్రా.. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
నటుడితో ప్రేమ, పెళ్లి
‘సనమ్ తేరీ కసమ్’ సినిమా ప్రేక్షకులకు అంతగా గుర్తిండిపోవడానికి హీరోహీరోయిన్‌గా నటించిన హర్షవర్దన్, మావ్రానే ముఖ్య కారణం. మామూలుగా సాడ్ ఎండింగ్‌తో ముగిసిన ఎన్నో ప్రేమకథలను ప్రేక్షకులు చూశారు. కానీ వాటిలో ‘సనమ్ తేరీ కసమ్’ చాలా డిఫరెంట్ అని చాలామంది ప్రేక్షకులు ఒప్పుకుంటారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన మావ్రా హోకేన్.. ఒక పాకిస్థానీ నటి. ఈ మూవీలో నటించిన తర్వాత తనకు ఇండియన్ మేకర్స్ నుండి అవకాశాలు రాలేదు. అందుకే తిరిగి పాకిస్థాన్ వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. ఇన్నాళ్ల తర్వాత తను ప్రేమించి అమీర్ గిలానీ అనే మరో పాకిస్థానీ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది మావ్రా.
సీరియల్‌లో నటిగా
మావ్రా హోకేన్ (Mawra Hocane), అమీర్ గిలానీ (Ameer Gilani).. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్యలో పెళ్లి చేసుకున్నారు. ఉన్నట్టుండి తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి మావ్రా ఫ్యాన్స్ సైతం షాక్‌లో ఉన్నారు. ఈ ఫోటోల్లో ఈ జంట చాలా అందంగా ఉందంటూ ప్రేక్షకులంతా ఈ కపుల్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ ఫోటోలను రీషేర్ కూడా చేస్తున్నారు. అసలైతే మావ్రా హోకేన్ ఒక సీరియల్ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాతే మెల్లగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ముందుగా ‘సనమ్ తేరీ కసమ్’ వల్లే తనకు ఇండియాలో మాత్రమే కాకుండా పాకిస్థానీ ఇండస్ట్రీలో కూడా పాపులారిటీ లభించి, ఆపై వెండితెరపై కూడా అవకాశాలు వచ్చాయి.
Also Read: ఆ యంగ్ హీరో కోసం సినిమా వదిలేసుకున్న అనన్య.. మరీ ఇంత ప్రేమ.?
అప్పటినుండే అనుమానాలు
మావ్రా హోకేన్ సీరియల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు అమీర్ గిలానీతో కలిసి పలు సీరియల్స్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘సబాత్’, ‘నీమ్’ లాంటి సీరియల్స్‌లో మావ్రా, అమీర్ కలిసి నటించారు. వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూసిన చాలామంది బుల్లితెర ప్రేక్షకులు వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా వీరి సోషల్ మీడియా పోస్టులు చూసిన ప్రతీసారి అందరిలో అనుమానాలు పెరిగిపోయాయి. అప్పుడప్పుడు మావ్రా, అమీర్ కలిసి పబ్లిక్‌లో కనిపించి డేటింగ్ రూమర్స్ నిజమే అనిపించేట్టుగా ప్రవర్తించారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఈ రూమర్స్ నిజమే అని అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.
Wishing them a forever of happiness and togetherness! My heart is soooo full ❤️✨#MawraHocane #AmeerGilani#MawraAmeerHoGayi pic.twitter.com/Reg26CCOqe
— 𝑎𝑣𝑖 (@avi_reads) February 5, 2025