BigTV English

Nara lokesh: బ్రాండ్ బాబు.. బ్రాండ్ వైజాగ్.. ఏపీకి విశాఖ గుండెకాయ -లోకేష్

Nara lokesh: బ్రాండ్ బాబు.. బ్రాండ్ వైజాగ్.. ఏపీకి విశాఖ గుండెకాయ -లోకేష్

ఏపీ రాజకీయాలను విశాఖ డిసైడ్ చేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న వరణ్ బే శాండ్స్ హోటల్, ఆఫీస్ టవర్ కు నారా భువనేశ్వరితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విశాఖ టీడీపీకి పెట్టని కోట అని అన్నారు లోకేష్. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు టీడీపీకి అండగా నిలిచారని చెప్పారు. 2019లో రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినా విశాఖలో టీడీపీ నాయకుల్ని ప్రజలు ఆదరించారన్నారు. చంద్రబాబుని 53రోజులు జైలులో నిర్బంధిచినప్పుడు కూడా విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయని చెప్పారు. 2024లో ఏపీలో అత్యథిక మెజార్టీ తనదేనని అనుకున్నానని, కానీ విశాఖలోనే రెండు నియోజకవర్గాలు తన మెజార్టీని బీట్ చేశాయని చెప్పారు. విశాఖలో టీడీపీకి అంత పట్టుందని అన్నారు లోకేష్.


బ్రాండ్ విశాఖ
బ్రాండ్ బాబుతో పాటు బ్రాండ్ విశాఖ కూడా తిరిగొచ్చిందని అన్నారు లోకేష్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10నెలల్లోనే రాష్ట్రానికి రూ.8లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ నగరం గుండెకాయ లాంటిదని చెప్పారు. విశాఖ నగరాన్ని ఎకనమిక్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. భారత దేశంలో 5వ అతిపెద్ధ ఆర్థికనగరంగా విశాఖ మారుతుందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం పరిశ్రమ వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలుగుతోందని చెప్పారు. విశాఖలో ఇప్పటికే వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించామని, రాష్ట్రానికి పెద్దఎత్తున కంపెనీలను రప్పించగలిగామని వివరించారు.

వైసీపీపై విమర్శలు..
గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లారని విమర్శించారు నారా లోకేష్. ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, గత ప్రభుత్వం పూర్తిగా తిరోగమన విధానాలో రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. కూటమి అధికారం చేపట్టే నాటికి ఏపీలో ఆర్థిక స్తబ్దత నెలకొందన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టాలనుకున్న లులు కంపెనీ కూడా వైసీపీ విధానాల వల్లే వెనక్కు వెళ్లిపోయిందని, తిరిగి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో విశాఖకు వచ్చిందని చెప్పారు లోకేష్.



అభివృద్ధి వికేంద్రీకరణ..
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం అని చెప్పారు లోకేష్. ప్రస్తుతం విశాఖలో వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ యావత్ భారతదేశానికి ఐకానిక్ గా నిలవబోతున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ఎంతో ఇబ్బందిపడ్డారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎయిర్ ఇండియా నుంచి త్వరలో రాష్ట్రానికి శుభవార్త వస్తుందని చెప్పారు. భారతదేశ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో విశాఖ రీజియన్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారులోకేష్. విశాఖను ఐటీ హబ్ గా అభివృద్ధిచేసి, రాబోయే అయిదేళ్లలో 5లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో అత్యాధునిక సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం అందుబాటులో ఉందని, భోగాపురం ఎయిర్ పోర్టు త్వరలో పూర్తికాబోతోందని, దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం అవతరించబోతోందని చెప్పారు లోకేష్.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×