ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చేతిలో పట్టుకుని అభిమానుల్ని ఉత్సాహపరిచారు మంత్రి నారా లోకేష్. గన్నవరం నియోజకవర్గంలోని అశోక్ లేలాండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వద్దకు వచ్చిన లోకేష్.. నూజివీడు మండలం సీతారాంపురంలో రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫొటోని తీసుకొచ్చారు. ఆ ఫొటోని గమనించిన లోకేష్ దాన్ని తన చేతిలోకి తీసుకుని అందరికీ చూపించారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ తోపాటు.. అక్కడున్న అందరూ కేరింతలు కొట్టారు.సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ గా మారింది.
Lokesh Holding Tarak Babu board Is Absolute Cinema 🔥
Idhi Kada ra Cadre Ki Kavalsina Emotion ❤️@naralokesh @tarak9999 💥pic.twitter.com/uYJBMm0n4l
— 𝗦𝗶𝗺𝗯𝗮𝗧𝘄𝗲𝗲𝘁𝘀_𝗫 🦁 (@SAgamanam) March 19, 2025
తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ అంటీముట్టనట్టు ఉంటున్నారనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. గతంలో ఎన్నికల ప్రచారం కోసం జూనియర్ ని వాడుకుని వదిలేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమధ్య కుప్పంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఎగురవేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా అన్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైడ్ నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడం విశేషం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూనియర్ సందడి ఏమాత్రం కనపడలేదు. దాదాపుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నట్టే లెక్క. అయితే మధ్యలో కొందరు వైసీపీ నేతలు, లక్ష్మీపార్వతి వంటివారు మాత్రం అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పగ్గాలు జూనియర్ కి అప్పగించాలని, అప్పుడే పార్టీ బాగుపడుతుందని వారు డిమాండ్ చేసేవారు. కొడాలి నాని కూడా రెండు మూడు సందర్భాల్లో టీడీపీ పగ్గాలు జూనియర్ కి అప్పగించాలనే సలహా ఇచ్చారు. అంటే ఒకరకంగా టీడీపీకి, జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాలు జరిగాయని అర్థమవుతోంది.
వైరి వర్గాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారా లోకేష్ మాత్రం ఎప్పటికప్పుడు వారి ఊహలకు అందని విధంగా ప్రవర్తిస్తున్నారని స్ఫష్టమవుతోంది. తాజాగా తన పర్యటనలో ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనపడినప్పుడు ఆయన హుందాగా ప్రవర్తించారు. ఆ ఫ్లెక్సీని కూడా తన చేతిలోకి తీసుకుని అందరికీ చూపించారు. దీంతో నారా ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ ఉందనుకునే ప్రచారానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని కూడా ఆయన ఓ రేంజ్ లో ఖుషీ చేశారు.
Also Read: కొలికపూడి మర్డర్ స్కెచ్? జనసేన కంప్లైంట్.. పవన్ ఎంటరైతే..?
లోకేష్ పర్యటనలో రెడ్ బుక్ ఫ్లెక్సీ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు రెడ్ బుక్ అమలు చేయాల్సిందేనంటూ టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిపై బదులు తీర్చుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్, రెడ్ బుక్ ఫ్లెక్సీని కూడా తన చేతిలోకి తీసుకుని అక్కడున్నవారందర్నీ ఉత్సాహపరిచారు.