National Highways in AP: రాష్ట్ర అభివృద్ధికి రహదారులు ధమక్ అంటే ఇదే. ఇక ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ప్రయాణిస్తున్న రహదారి ప్రాజెక్టులు ఇప్పుడు మెరుపు వేగంతో ముందుకు సాగుతున్నాయి. జెట్ స్పీడ్ అన్నది కేవలం విమానాలకే కాదు.. రాబోయే రోజుల్లో మన రోడ్లకూ వర్తించనుందేమో అనిపిస్తోంది. శాశ్వత రాజధాని డిస్కషన్‌తోపాటు.. మౌలిక సదుపాయాల్లో భాగమైన రహదారి వృద్ధి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతగా మారింది. కొన్ని ప్రాజెక్టులైతే దేశానికి తలమానికంగా నిలవనున్నాయి. భారీ నిధులతో కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేపట్టిన కీలక ప్రాజెక్టులు ఇప్పుడు అంతర్‌రాష్ట్ర కనెక్టివిటీకి కొత్త దారులు వేస్తున్నాయి. దీనితో ఇక ఆ రహదారుల్లో వాహనాల స్పీడ్ అంచనా వేయలేం.
ఈ రూట్ లో ఇక.. పరుగులే
ప్రస్తుతం రాష్ట్రాన్ని కవర చేసే ప్రధాన ప్రాజెక్టుల్లో బద్వేల్ – నెల్లూరు ఫోర్ – లేన్ కారిడార్ (NH-67) ముఖ్యమైనది. 108 కిలోమీటర్ల ఈ హైవే నిర్మాణానికి కేంద్రం రూ. 3,653 కోట్లను మంజూరు చేసింది. ఇది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం వంటి పారిశ్రామిక నగరాలను కలుపుతూ భారీ లాజిస్టిక్స్ కారిడార్‌గానే మారుతోంది. ప్రత్యేకించి రాయలసీమ అభివృద్ధికి ఇది మార్గదర్శిగా నిలవనుంది.
విశాఖలో రికార్డ్ రహదారి..
అంతే కాదు, దేశ దిక్కులను కలిపే రాయపూర్ – విశాఖపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు కూడా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ మార్గంలో విస్తరించే ఈ 464 కిలోమీటర్ల హైవేకు రూ.20,000 కోట్లకు పైగా వ్యయం అంచనా. ఇది తూర్పు తీరాన్ని కేంద్రానికి దగ్గర చేస్తూ పారిశ్రామిక, పోర్ట్ లింకేజెస్‌ను బలోపేతం చేస్తోంది. ఇదే మార్గాన్ని అభివృద్ధి చేస్తూ బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సైతం 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకెళ్తోంది.
ఇంకా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే కూడా ప్రధానంగా అభివృద్ధి చెందుతోంది. నేషనల్ హైవే 365BBగా రూపొందిన ఈ మార్గం 162 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండగా, రూ. 4609 కోట్ల నిధులతో నిర్మాణంలో ఉంది. ఇది తెలంగాణతో ఉన్న కనెక్టివిటీకి కొత్త ఊపునిస్తోంది.
ఇదైతే కాస్త వెరైటీ..
రెగ్యులర్ హైవేలతో పాటు విశిష్ట ప్రాజెక్ట్‌గా అమరావతి – విజయవాడ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలు కూడ కల్పించబడ్డాయి. ఇది ఐకానిక్ బ్రిడ్జ్‌గా మారే అవకాశముండగా.. రాజధాని ప్రాంతానికి ప్రత్యక్ష డైరెక్ట్ కనెక్టివిటీని కల్పించనుంది. హైదరాబాద్ – విజయవాడ హైవేతో అమరావతిని కలిపే ఈ బ్రిడ్జ్.. రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
Also Read: World’s Tallest Statue: ఏపీ సరిహద్దులో ఉన్నారా? ఈ అద్భుతం చూడకుంటే.. చాలా మిస్ అయినట్లే!
నిధుల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం రూ.6,585 కోట్ల విలువైన 7 నేషనల్ హైవే ప్రాజెక్టులను ఆమోదించింది. దీనితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధికి PMGSY ఫేజ్-III కింద రూ. 223 కోట్లు, ఇతర ప్రాంతాల రోడ్లకు రూ. 400 కోట్లు, ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 98 కోట్లు ఇలా పలు విభాగాల్లో భారీగా కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను వదలకుండా అడుగులు వేస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర హైవేలను పునరుద్ధరించేందుకు రూ. 600 కోట్లు కేటాయించగా, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో మరో 18 రహదారుల అభివృద్ధికి రూ. 861 కోట్లు విడుదల చేసింది. అంతేకాదు, న్యూయార్క్ బ్యాంక్ (NDB) ద్వారా నిధులు పొందిన 1,300 కిలోమీటర్ల రహదారుల పనులు వేగవంతం చేయేందుకు రూ. 200 కోట్లు విడుదల చేసింది.
ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు, వాణిజ్య మార్గాలు, పర్యాటక రంగం బలపడనుండటం ఖాయం. అప్పటిదాకా అయితే.. ఈ వేగం చూస్తుంటే ఏపీలో ఇదేం రహదారులు.. ఇక జెట్ స్పీడ్ పరుగులే అనిపించడం తథ్యం!