Chiru157 : మెగాస్టార్ చిరంజీవి ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మెగాస్టార్ కామెడీ టైమింగ్ ని పట్టుకుంటే థియేటర్లో నువ్వులు పూస్తాయి. కలెక్షన్లు కొత్తదారులు వెతుక్కుంటాయి. రికార్డ్స్ బద్దలవుతాయి. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్ సినిమాలు కొన్నిసార్లు చేస్తున్నారు. కానీ వాస్తవానికి బాస్ అంటే బేస్. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ రీసెంట్ టైమ్స్ లో చాలామంది మిస్ అయ్యారు. కొంతవరకు వాల్తేరు వీరయ్య సినిమాలో బాబీ బయటికి తీశాడు. అందుకే ఆ స్థాయిలో వర్కౌట్ అయింది.
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ తన 157 వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు అనిల్ రావిపూడి కెరియర్ లో ఒక్క డిజాస్టర్ సినిమా కూడా లేదు. అలానే అనిల్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మెగాస్టార్ తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు అంటేనే మినిమం గ్యారంటీ. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.
మెగా – అనిల్ షెడ్యూల్ అప్డేట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 157 ఏడవ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయిపోయాయి. ఒక ప్రస్తుతం మూడవ షెడ్యూల్ రెడీ చేస్తుంది చిత్ర యూనిట్. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. జులై 8 నుంచి హైదరాబాదులో మొదలయ్యాయి షూటింగ్ జులై 22న కేరళలో ఎండ్ అవుతుంది. ఆ విధంగా ప్లాన్ చేశాడు అనిల్. ఒక రెండు రోజులు అటూ ఇటూ అయినా కూడా ఈ నెలలో ఈ సినిమా పూర్తి కావడం ఖాయం. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో పర్ఫెక్ట్ టైమింగ్ లో సినిమాను ఫినిష్ చేశాడు అనిల్ రావిపూడి.
సినిమా సక్సెస్ అయితే థియేటర్ లో స్పీడ్ తగ్గదు
కొంతమంది అనిల్ రావిపూడి ని పర్సనల్ గా ట్రోల్ చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అనిల్ చేసే సక్సెస్ మాత్రం వేరే రేంజ్. ఒక కథ పాయింట్ తీసుకొని దానికి ఏ స్థాయిలో కామెడీని జోడించాలో పర్ఫెక్ట్ గా తెలుసు. ఇక మెగాస్టార్ చిరంజీవి కి కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేశాడు. మెగాస్టార్ తో పాటు ఈ సినిమాల్లో లేడీస్ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ తో కామెడీ పండించాడు అనిల్. ఈ సంక్రాంతికి రాబోతూ థియేటర్లో మరింత కామెడీను పండించనున్నాడు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అద్భుతమైన సక్సెస్ సాధించాడు. మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సంక్రాంతికి మెగాస్టార్ ను సిద్ధం చేస్తున్నాడు.
Also Read : మన హీరోలు జీరోలా? ఫిష్ వెంకట్‌ను ఎందుకు ఆదుకోలేకపోతున్నారు?