BigTV English

YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి! ఓడినా మారని నేతల తీరు

YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి! ఓడినా మారని నేతల తీరు

చిత్తూరు జిల్లాలో హవా చలాయించిన వైసీపీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ఒక రకంగా కంచుకోటగా చెప్పాలి. వైసీపీ ఆవిర్భావం నుండి అత్యధిక సీట్లు గెలుచుకోవడమే కాకుండా, 2019లో ఏకంగా 14 స్థానాలకు 13 స్థానాలను గెలుచుకొని టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత జిల్లాలోని ఊహించని షాక్ ఇచ్చింది జగన్ పార్టీ. కానీ సీన్ కట్ చేస్తే ఆ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉండిపోయారు జిల్లా సీనియర్ నేతలు. ఈ ఉమ్మడి జిల్లాలో వైసీపీకి అత్యంత కీలకమైన సీనియర్ నేతలున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రోజా, నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , మధుసూదన రెడ్ఢి లాంటి నేతలు వైసీపీలో కీలకంగా ఉంటూ జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే వారే.


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణల గుప్పించిన రోజా

2019లో అధికారంలోకి వచ్చాక జిల్లా వైసీపీ నేతలు గ్రూపులు కట్టారు. ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. జిల్లాలో గత ఐదేళ్లుగా నగరి నియోజవర్గం కేంద్రంగా జరిగిన రచ్చ అంతా కాదని చెప్పాలి. నగరి వైసీపీ నేతలు రోజాపై ప్రెస్‌మీట్లు పెట్టి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే దానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కారణమని రోజా పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించారు. వారిద్దరి మధ్య గొడవలు పలుమార్లు పీక్స్‌కి చేరి నేరుగా అధినేతకే ఫిర్యాదులు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడి తనయుడు, ప్రస్తుత నగరి టీడీపీ ఎమ్మెల్యే భాను సోదరుడు గాలి జగదీష్‌ను వైసీపీ నుంచి బరిలోకి దించి రోజాను రాజకీయాలను నుంచి బయటకు పంపడానికి పెద్దిరెడ్డి ప్లాన్ చేస్తున్నారంట.

మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితోనూ రోజాకి పేచీలు

మాజీ మంత్రి రోజాకు పెద్దిరెడ్డితో పాటు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితోనూ పేచీలు ఉన్నాయంట. ఇక జిల్లాలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భుమన కరుణాకర్‌రెడ్డిలు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఒక సెపరేట్ టీమ్‌గా వ్యవహరించేవారు.. ఆ గ్రూపులో రోజా కూడా చేరినట్టుగా మధ్యలో ప్రచారం సాగింది …చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డిల మధ్య కూడా చాలా కాలం పాటే చేప కింద నీరులా వైరం సాగింది. ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి అనుచరుడిని చెవిరెడ్డి సస్పెండ్ చేయించారు. పెద్దిరెడ్డి రాజకీయం కారణంగానే తామంతా ఓడిపోయామని ఆయన వ్యతిరేకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారిప్పుడు.

పరాజయం పాలైనా వైసీపీ నేతల్లో కనిపించని మార్పు

ఇలా ఎవరికి వారే విడిపోయి గ్రూపులు కట్టడంతో గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని వైసీపీ కార్యకర్తలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో పార్టీకి అంతటి దారుణపరిస్థితి రావడానికి కారణం వారి మధ్య గొడవలే కారణమని జిల్లా వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా… చిత్తూరు జిల్లా సీనియర్ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్టే కనిపిస్తున్నా.. లోపల మాత్రం పరిస్థితులు వేరేగా ఉన్నాయని ఇప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి మేడిపండులానే ఉందంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

నేతలను వెంటాడుతున్న కేసులు, అరెస్టుల భయాలు

గత కొన్ని నెలలుగా జిల్లాలోని ఆయా నేతలను కేసులు, అరెస్టు భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినా కూడా ఒకరి గురించి ఒకరు మాకెందుకులే అన్నట్లే మిన్నుకుండిపోతున్నారు. రోజాను ఆడుదాం ఆంధ్ర వ్యవహారం, పెద్దిరెడ్డికి లిక్కర్ స్కాం , భూకబ్జాల ఆరోపణలు, మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన వ్యవహారం వెంటాడుతున్నాయి‌. చెవిరెడ్డిని తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెంటాడుతుంటే, భూమన కరుణాకరరెడ్డిపై టీడీఆర్ బాండ్ల వినియోగానికి సంబంధించి విచారణ సాగుతోంది. ఇక నారాయణస్వామికి లిక్కర్ కేసులో ఎమవుతుందో అని ఆయన అనుచరులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీని మరింత డ్యామేజ్ చేస్తున్న నేతల వైఖరి

ఆయా విచారణలు, కేసులు ,అరెస్టులు భయాలు వెంటాడుతున్నా జిల్లా వైసీపీ నేతలు ఒకరికి ఒకరు సపోర్టు చేసుకున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఎవరికి వారు మీకెందుకు అన్నట్టుగానే వ్యవహరిస్తుండటం జిల్లా వైసీపీలో క్యాడర్‌కు మింగునుబడటంలేదంట. కనీసం ఒకరికి ఒకరు మోరల్ సపోర్టు కూడా ఇవ్వడానికి నేతలు ఇష్టపడక పోతుండటం పార్టీని మరింత డ్యామేజ్ చేస్తోందంటున్నార. ఇప్పుడే ఇలా అంటే ఒకవేళ అరెస్టులు పర్వమే మొదలైతే అప్పుడు కూడా ఆ పోతే పోనీలే మనకెందుకు అనుకుంటే క్యాడర్‌కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ నేతలు అంటున్నారు. ఆయా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న నేతలు అరెస్టు అయితే తమకు ఎంత మేరకు లాభం చేకూరుతుందని లెక్కలు వేసుకుంటున్నారని, అలాంటి నేతలపై జగన్ దృష్టి పెట్టకపోతే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని ఇప్పటికే పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేశారంట. మరి ఈ ఆధిపత్యపోరుకి జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి.

 

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×