Gundeninda GudiGantalu Today episode April 19 th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు తన మనసులోని బాధను బయటపెట్టిన తర్వాత అందరు బాలు మనసులో ఇంత బాధ ఉందా అందరిని ఏడిపించేశాడు అని అంటారు. ఆ తర్వాత బాలు కఠినమైన మనసులో ఇంత బాధ నిజంగా గ్రేట్ అని శృతి అంటుంది. ఇక బాలు ఒంటరిగా బాలు బాధ పడతాడు. మీనా వచ్చి ఏంటి ఒంటరిగా బాధపడుతున్నారు అని అడుగుతుంది. నేను ఒంటరిగా లేను నువ్వు ఉన్నావు కదా అని అంటాడు. తన బాధను చెప్పుకొని బాధ పడతాడు. అప్పుడే సుశీల అక్కడకు వచ్చి మీ ఇద్దరు విడిపోవద్దు అని కంగారు పడుతూ వస్తుంది. ఇద్దరికి దిష్టి తీస్తుంది. ఆయన ముందులాగా లేదు బామ్మ మారిపోయాడని మీనా అనగానే సుశీల రిలాక్స్ అవుతుంది. సిటీకి రాగానే ప్రభావతి బాలు, మీనా పై నోరు పారేసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ ఇంట్లోకి వెళ్తారు. వెళ్లగానే రెస్ట్ తీసుకోవాలని రోహిణి మనోజ్, శృతి అంటారు. మరోవైపు ప్రభావతి కూడా కాస్తా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. ఎవరి గదుల్లోకి వారు వెళ్లాలని అనుకుంటారు. మీనాను ప్రభావతి కాఫీ అడుగుతుంది. దాంతో పూలకొట్టు తీశాక ఇస్తానని బదులిస్తుంది. సత్యం కాఫీ ఇచ్చాక ఆ పని చేసుకో అని చెప్తాడు. ఇక ప్రభావతి వచ్చిందని తెలుసుకొని కామాక్షి అక్కడకు వస్తుంది. ఇద్దరి మధ్య కామెడీ కాస్త అందరిని నవ్విస్తుంది..
ప్రభావతి కామక్షితో ఒంటిరిగా మాట్లాడాలని అంటుంది. దీంతో హాల్ లో కాకుండా వేరే గదిలో కూర్చొని మాట్లాడుకుందామని అంటుంది. రవి శృతి వాళ్ల రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందామని ఆ గది దగ్గరికి వెళ్తారు. ప్రభావతి శృతిని పిలిచే లోపే శృతి తన భర్త రవిని గదిలోంచి బయటికి నెట్టివేస్తుంది. దీంతో ప్రభావతి, కామక్షి రవిని అలా గెంటేయడం చూసి షాక్ అవుతారు. దీంతో కామక్షి ఎటకారంగా ఏవమ్మా శృతి మీ అత్తగారి మొహం మీదనే తలుపు వేశావు. కొంచెం ఉంటే మీ అత్తయ్య ముక్కు పగిలిపోయేది అని దెప్పిపొడుస్తుంది. డ్రెస్ మార్చుకోవాలి అని ఏదోకటి చెప్పేస్తుంది. అవును నిజమే అని కామాక్షి అంటుంది.
ఆ తర్వాత రోహిణి వాళ్ళ రూమ్ కు వెళ్తారు.. అక్కడ రోహిణి మనోజ్ ను తిడుతుంది. అది విన్న కామాక్షి ఇక్కడ కూడా లేదు. అని ప్రభావతిని ఎత్తి పాడేస్తుంది. మనోజ్ పై రోహిణి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఊరు నుంచి తిరిగి వచ్చాక ఉద్యోగం చూసుకుంటానని చెప్పి మంచిగా పడుకుంటున్నావా? అని మండిపడుతుంది. దీంతో మనోజ్ లేస్తూ ఉద్యోగం రావడం లేదని లేజీగా బదులిస్తాడు. ఇక ఉద్యోగం రాకపోతే లక్షలు మింగడం వచ్చా అని మనోజ్ ను తిడుతుంది. ఇవన్నీ మాటలు వింటూ ప్రభావతి అవమానంగా భావిస్తుంది..
ఇక చివరగా బాలు గదికి వెళ్తే అక్కడ బాలు పడుకొని నిద్రపోతాడు. అయితే అక్కడకు వెళ్లగానే బాలు నా రూమ్ అని అక్షింతలు వేస్తారు. ఎవరి కొంపలు కులుస్తారు అని అడుగుతాడు. అదేం లేదు అని మెల్లగా పైకి వెళ్తారు. కామాక్షి నీకు రూమ్ కూడా లేదు అని ఏద్దేవా చేస్తుంది. ఇక ప్రభావతి తన బిజినెస్ గురించి చెబుతుంది. ప్రభావతి స్పందిస్తూ నాకంటూ ప్రత్యేకమైన గదిలో లేకుండా పోయిందని అంటుంది. పైన ఒక గది కట్టించుకోని హాయిగా ఉండండి అని బదులిస్తుంది. దానికి ప్రభావతి కూడా స్పందిస్తూ అదే అనుకున్నాం. కానీ అందరికి సరిపడా రూమ్ లు ఉంటే బాలు, మీనాను బయటికి గెంటేయడం వీలవ్వదు కదా అని అంటుంది. వారిని బయటికి పంపించాక మూడంతస్తుల మేడ కట్టుకుంటామని ఇక్కడ హాల్, ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ స్విమ్మింగ్ ఫూల్ అని చెబుతుంది. అక్కడకు మీనా వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..