Balakrishna on akhanda 2 teaser : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమా అఖండ 2. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. బోయపాటి శ్రీను పేరు చెప్పగానే మొదటి గుర్తిచ్చేవి కూడా బాలకృష్ణతో చేసిన సినిమాలు. ఇకపోతే అఖండ సినిమా విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరీర్ కు ఒక కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో చేసిన ప్రతి దర్శకుడు మంచి సక్సెస్ అందించారు. ఇంకా ప్రస్తుతం రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ టీజర్ గురించి మంచి పాజిటివ్ కామెంట్స్ తో పాటు కొన్ని ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి.
బాలకృష్ణ ఫోన్ కాల్ లీక్
ఒక అభిమాని బాలకృష్ణకు ఫోన్ చేసి టీజర్ గురించి మాట్లాడారు. లుక్ చాలా అరాచకంగా ఉంది అని తెలిపారు. దానవీరశూరకర్ణ సినిమాలోని అన్నగారి లుక్ ఎలా అయితే గుర్తుండిపోయిందో ఈ లుక్ కూడా గుర్తుండిపోతుంది. అని చెప్పిన అభిమాని మాటలకు, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. బయట వాళ్ళు ఫోన్ చేసి పదిసార్లు చూశామని అంటున్నారు. దానికి సమాధానంగా నేను అన్నాను నైట్ అంతా చూస్తూనే ఉంటారు మీకు ఈ రాత్రికి నిద్ర పట్టదు అంటూ బాలకృష్ణ మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి బాలకృష్ణ బోయపాటి (Boyapati Sreenu) కాంబినేషన్ మరొకసారి బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అవుతుంది అని ఈ టీజర్ నమ్మకాన్ని కలిగించింది.
భారీ అంచనాలు
ఇప్పటివరకు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే అఖండ విషయానికి వస్తే సింహా,లెజెండ్ కంటే కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అఖండ సినిమాని మించి అఖండ 2 ఉండాలి. ప్రస్తుతానికి టీజర్ తో అయితే ప్రేక్షకులు హ్యాపీగానే ఉన్నారు. కానీ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందిస్తారా లేదా అనేది చాలామందికి ఉన్న సందేహం. ఈ సినిమా అనుకున్నట్లుగానే హిట్ అయిపోతే ఆ తర్వాత బాలకృష్ణతో చేయబోయే దర్శకులు ఇంకొంత కేర్ఫుల్ గా సినిమాలు తీయాల్సి ఉంటుంది. మొత్తానికి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు.
Also Read: Sree Vishnu : శ్రీ విష్ణు ముందు… అప్పట్లోనే సినిమాల్లో బూతులు వాడిన నటుడు ఎవరో తెలుసా ?