Big Tv Live Original: కుంభమేళా రైళ్లపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రైల్వే రక్షణ దళం (RPF) రంగంలోకి దిగింది. బీహార్, ఉత్తరప్రదేశ్ లోని పలు స్టేషన్లలో రైళ్లపై జరిగిన దాడులపై ఫోకస్ పెట్టింది. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారులు 4 FIRలు నమోదు చేశారు. రైల్వే చట్టాలక ప్రకారం నిందితులపై కేసులు నమోదు చేశారు. సీసీటీవీల ద్వారా నిందితులను గుర్తిస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
కుంభమేళా రైళ్లపై దాడుదల విషయంలో అధికారుల సీరియస్
రీసెంట్ గా బీహార్ లోని ఎక్మా, మధుబని, దానాపూర్ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు రైళ్లపై దాడులు చేశారు. కిటికీలు, డోర్లు పగులగొట్టారు. బయటున్న ప్రయాణీకులు చెక్క కర్రలతో, కాళ్లతో దాడి చేసి రైలును డ్యామేజ్ చేశారు. ఈ దాడులతో రైలు లోపల ఉన్న ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. అంతేకాదు, ఓ రైల్లోని ఇంజిన్ లోకి ప్రయాణీకులు ఎక్కడంతో పాటు ప్రయాగరాజ్ లోని సుబేదార్ గంజ్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలుపై రాళ్లు రువ్వడం పైనా రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.
బీహార్ ఏక్మా స్టేషన్ లో బుధవారం లిచ్చవి ఎక్స్ ప్రెస్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటన కు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 153 అంటే రైలులో ప్రయాణించే వ్యక్తుల భద్రతకు ముప్పు కలిగించడం పట్ల చాప్రా జంక్షన్ లోని RPF పోస్ట్ లో FIR నమోదు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అటు ఫిబ్రవరి 10న జయనగర్-న్యూఢిల్లీ స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ పై మధుబని స్టేషన్ లోని కొంతమంది ప్రయాణీకులు దాడికి పాల్పడటంపైనా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రయాగరాజ్ లోని కుంభమేళా రైలులో స్థలం కోసం ప్రయాణీకులు ఇతర ప్రయాణీకులను కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై కతిహార్ RPF పోస్టులో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: రైలు నుంచి బాటిళ్లు బయటకు విసురుతున్నారా? ఎంత ప్రమాదకరమో చూడండి!
సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుల గుర్తింపు
ఇప్పటి వరకు మహాకుంభ మేళా రైళ్ల మీద జరిగిన అన్ని దాడుల ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని రైల్వే అధికారులు హెచ్చరించారు. కుంభమేళా కోసం బోలెడు రైళ్లు నడుపుతున్నట్లు చెప్పిన రైల్వే అధికారులు. ఒక రైలులో స్థలం లేకపోతే, మరో రైలులో వెళ్లాలే తప్ప, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించకూడదంటున్నారు. ఒకవేళ విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Read Also: అక్కడ అంతేనా? అద్దాలు పగలగొట్టు మరి రైల్లోకి.. భక్తులూ ఇదేం పని?