MI VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగాయి. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో 11 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ 12వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Mumbai Indians vs Kolkata Knight Riders ) జట్ల మధ్య… భీకర పోరు జరగనుంది. ముంబైలోని వాంకాడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైట్ జరగనుంది.
Also Read: CSK VS RR: చివరలో అదరగొట్టిన సందీప్ శర్మ.. రాజస్థాన్ తొలి విజయం
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?
ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Mumbai Indians vs Kolkata Knight Riders ) జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది. ఇందులో టాస్ గెలిచినా జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ వస్తుంది.
ఖాతా తెరవని ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 Tournament ) ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా తయారయింది. పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరన మిగిలింది ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. రెండు మ్యాచ్లు ఆడితే… రెండు మ్యాచ్లో కూడా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. మొదట చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్…. మొన్న గుజరాత్ చేతిలో చిత్తు అయింది. ఇక ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పైన అయినా… గెలవాలని ముంబై ఇండియన్స్ స్కెచ్ వేస్తోంది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మొదటి మ్యాచ్ లోనే ఫైన్ ?
ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల అంచనా
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XII ( Mumbai Indians ): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్ మరియు సత్యనారాయణ రాజు
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ XII ( Kolkata Knight Riders ): క్వింటన్ డి కాక్ ( Decok), వెంకటేష్ అయ్యర్ ( Venkatesh iyer), అజింక్యా రహానే, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి మరియు అంగ్క్రిష్ రఘువంశీ