ఆమె పేరు సుమయ రెడ్డి.
హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ కూడా.
ఇటీవలే డియర్ ఉమ అనే సినిమా కూడా తీశారు, అందులో ఆమే హీరోయిన్.
హీరోయిన్ సుమయ అంటే ఎవరికీ ఆమె గుర్తుకు వచ్చేవారు కాదేమో. కానీ తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చతో సుమయ టాక్ ఆఫ్ ఏపీగా మారారు. అయితే ఆ నెగిటివ్ కామెంట్స్ ని భరించలేక ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దయచేసి నెగెటివ్ కామెంట్స్ ని ఆపేయండి అని వేడుకుంటున్నారు.
రాజకీయాలు చేయండి..కానీ ఇలా అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి?#SaveWomensinAP#CBNFailedCM#AndhraPradesh#YSJaganTimes #boycottparitalapolitics #ThopudurthiPrakashReddy pic.twitter.com/I1EW0ZpnRE
— Thopudurthi Prakash Reddy (@ImThopudurthi) April 7, 2025
ఇంతకీ ఏమైంది..?
హీరోయిన్ సుమయ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల ఓ ఎయిర్ పోర్ట్ లో కలసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమయ రెడ్డి భుజంపై చేయి వేసి, ఆమెను దగ్గరకు తీసుకుని తోపుదుర్తి మాట్లాడిన వీడియో అది. ఆ వీడియోను వెనక నుంచి కొంతమంది షూట్ చేసినట్టు తెలుస్తోంది. దాన్నిప్పుడు కొందరు టీడీపీ అభిమానులుగా చెప్పుకుంటున్న వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది.
ఫ్యామిలీ ఫ్రెండ్స్..
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హీరోయిన్ సుమయ రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. గతంలో కూడా తోపుదుర్తి ఫ్యామిలీతో సుమయ దిగిన ఫొటోలను ఇప్పుడు బయటపెట్టారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్న తమపై టీడీపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈనెల 8వతేదీన మాజీ సీఎం జగన్ రామగిరి మండలానికి వస్తున్న నేపథ్యంలో.. తనపై ఇలా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని అంటున్నారు. తనతోపాటు తన కుటుంబ సభ్యుల్ని, సమీప బంధువుల్ని కూడా నీఛపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారని అన్నారు. ఆ వీడియో అప్ లోడ్ చేసినవారిపై, పోస్టింగ్ లు పెట్టినవారిపై పోలీసులకు పిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. పాతికేళ్లుగా రాజకీయ జీవితంలో తాను సంపాదించుకున్న గౌరవ మర్యాదల్ని నష్టపరచాలని చూస్తున్నారని చెప్పారు. టీడీపీ విష ప్రచారాన్ని ఎవరూ నమ్మట్లేదని, వారి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తనపై బురదజల్లడం సరికాదని చెబుతున్నారు.
నమస్తే..🙏🙏
—నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రేపటి రోజున రామగిరి మండలానికి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి దురాగతాలపై గొంతు ఎత్తడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారిని… pic.twitter.com/POoPOKb7hc
— Thopudurthi Prakash Reddy (@ImThopudurthi) April 7, 2025
సుమయ ఆవేదన..
తోపుదుర్తి పోస్టింగ్ తోపాటు, హీరోయిన్ సుమయ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తోపుదుర్తి తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, తరచూ తమ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతుంటాయని ఆమె చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మహిళను ఇంతగా వేధిస్తారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద ఈ వీడియో వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది. జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా ఈ వీడియోని ఉద్దేశపూర్వకంగానే టీడీపీ అభిమానులు రిలీజ్ చేశారని అంటున్నారు.
అయితే టీడీపీకి చెందిన ప్రధానమైన ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఈ వీడియో కనపడ్డంలేదు, ఒకరిద్దరు మాత్రం దీనిపై వీడియోలు చేశారు. అదే సమయంలో సీమరాజా ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఈ వీడియో ఉంది. ఎవరో ఏంటో తెలుసుకోకుండా మనం కామెంట్ చేయొద్దంటూ సీమరాజా కాస్త హుందాగానే వీడియో చేశారు.
https://twitter.com/Seemaraja_Off/status/1909161180750361023