Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులపై అధ్యయనం చేస్తోంది కేంద్ర పార్లమెంటరీ కమిటీ. కమిటీ ఛైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆధ్వర్యంలో మొత్తం 30 మంది సభ్యుల కమిటీ శనివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. ఏపీ జలవనరుల ఖశాఖ మంత్రి నిమ్మల రామానాయడు, ఎమ్మెల్యే బాలరాజు కమిటీకి స్వాగతం పలికారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనుల పని తీరును తెలుసుకుంది.
గడిచిన ఐదేళ్లలో పని ఎంత మేరా జరిగింది? అంతకుముందు జరిగిన పనులను పూర్తిగా వివరించారు. త్వరలో చేపట్టబోయే పనులు ఏంటి? ఏయే అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని అనేది కమిటీ తెలుసుకుంది. ఇప్పటివరకు జరిగిన పనుల తీరుపై అధ్యయనం చేయనుంది రూఢీ కమిటీ. కాఫర్ డ్యామ్, డయా ఫ్రం వాల్, స్పిల్ వే వాటిని పరిశీలించనుంది.
ప్రాజెక్ట్ నిర్మాణంతోపాటు నిర్వాసితులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఏడేళ్ల కిందట నిర్వాసితులకు రూ 800 కోట్లు పరిహారం అందించింది చంద్రబాబు సర్కార్. ఇప్పుడు మరో రూ 830 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఏడాదిలోగా పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులకు అందిస్తామన్నారు సదరు మంత్రి.
ఆ తర్వాత ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ నిఫుణులతో పనితీరును సమీక్షా సమావేశం నిర్వహించింది. పరిశీలన తర్వాత కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది రూఢీ కమిటీ. రేపోమాపో ప్రాజెక్టు పనులు చేపట్టాలని కూటమి సర్కార్ భావిస్తోంది. దీనికి కేంద్ర జలసంఘం అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ప్రాజెక్టు స్థితిగతులు సమీక్షించేందుకు కమిటీ పర్యటిస్తోంది.
ALSO READ: ఏపీలో ఆ ముగ్గురు.. లేకుంటే కమలం మటాష్
కమిటీ సభ్యులతోపాటు జలశక్తి శాఖకు చెందిన సీనియర్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పనుల జాప్యానికి గల కారణాలను కమిటీ సమీక్షించ నుంది. ఐదేళ్ల కిందట వచ్చిన వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయ్యింది. దెబ్బతిన్న భాగాలను కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిఫుణుల కమిటీ పరిశీలించింది.
రూ. 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని నిర్ణయించింది. పాత డయా ఫ్రమ్ వాల్ కంటిన్యూ చేస్తే మళ్లీ వరదలు వస్తే డ్యామ్‌కు కష్టాలు తప్పవని భావిస్తోంది. ఈ క్రమంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించింది. కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన మెటీరియల్ పై సూచనలు చేయనుంది.