Jagan Vs Pawan Kallyan: వైసీపీ అధినేత జగన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోందా? సొంత సమస్యలను డైవర్ట్ చేసేందుకు కొత్త స్కెచ్ వేశారా? పక్షం లేకుంటే వారానికి ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారా? వివేకా, లిక్కర్ కేసులు జోరందుకోవడంతో ఈ ఎత్తగడ వేస్తున్నారా? జగన్‌కు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టి ఝలక్ ఇవ్వనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా కాకుండా వ్యక్తి గతంగా కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బాబాయ్ వివేకానంద హత్య, ఇంకోవైపు లిక్కర్ కేసులు తరుముకుంటూ వస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ అయ్యారు. మరో మంత్రి అంబటికి ఈడీ నోటీసులు ఇచ్చినా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్యం బాగా లేదంటూ విచారణకు ఎస్కేప్ అవుతున్నట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసే అవకాశముందన్న వార్తలు వైసీపీని గందరగోళంలోని నెట్టేశాయి.
ఇదిలావుండగా వైసీపీకి ఉత్తరాంధ్రలో జనసేన నుంచి ఊహించని షాక్ తగలనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నేతల జాయినింగ్ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు నలుగురు ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు ఓ ఫీలర్ చక్కర్లు కొడుతోంది. ఆయా నేతలు సీనియర్ లీడర్ల ద్వారా పవన్ కల్యాణ్‌తో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆ నేతలు జనసేనలోకి చేరిపోవడం ఖాయమనే వాదన లేకపోలేదు.
విశాఖ సిటీకి చెందిన ఇద్దరు, విజయనగరం జిల్లాకు చెందిన మరొక మాజీ మంత్రులతో జనసేన కీలక నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. విడతల వారీగా జనసేనలో నేతలు జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు చాలామంది చేరే అవకాశాలున్నట్లు జనసేన వర్గాల మాట. అదే జరిగితే ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోని దెబ్బ తగలడం ఖాయమనే చర్చ అప్పుడే మొదలైంది.ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు ఉద్యోగుల చేత నిరసనలు చేసేలా వైసీపీ స్కెచ్ వేసిందని అంటున్నారు.
ALSO READ: విశాఖలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య.. విచారణకు మంత్రి ఆదేశం, మృతురాలి సొంతూరు హైదరాబాద్
ఉత్తరాంధ్ర నుంచి గుడివాడ, అవంతి, సత్తిబాబుతోపాటు మరొకరు ఉన్నట్లు సమాచారం. అలాగే నలుగురు మాజీ ఎమ్మెల్యేలు వారి దారిలో నడిచేందుకు సిద్దమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ పాదయాత్రకు ముందే ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని నేతలు చర్చించుకోవడం మొదలైంది. వలసల గుండం నుంచి వైసీపీ అధినేత ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి.