BigTV English
Advertisement

Pawan Kalyan : పాపం పసివాడు.. జగన్ సెటైర్లకు పవన్ కౌంటర్..

Pawan Kalyan : పాపం పసివాడు.. జగన్ సెటైర్లకు పవన్ కౌంటర్..

Pawan Kalyan political news(Latest News in AP) : ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్. పాపం పసివాడు సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేసి.. ఈ సినిమాను ఎవరైనా జగన్‌ను పెట్టి రీమేక్ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. అ పోస్టర్‌లో చిన్న పిల్లవాడు సూటు కేసు పట్టుకుని నడుచుకుంటూ పోతున్నట్లుగా ఉంది. కాకపోతే అందులో చిన్న మార్పు చేయాలని.. జగన్ చేతిలో సూట్ కేసు బదులు సూట్ కేసు కంపెనీలు పెట్టాల్సి ఉందని ట్వీట్ చేశారు.


అక్రమార్జనను మనీలాండరింగ్ ద్వారా ఈ సూట్ కేసుల ద్వారా జగన్ పంపుతున్నారని పవన్ ఆరోపించారు. జగన్ అమాయకుడిగా నటిస్తున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమ సంపాదనతో అత్యంత ధనిక సీఎంగా ఉంటూ క్లాస్ వార్ అంటూ చెప్పుకోవడంపై పవన్ మండిపడ్డారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి .. లాంటి వ్యక్తి జగన్ కాదన్నారు. క్లాస్ వార్ అనే పదాన్ని పలికే అర్హత కూడా జగన్ కు లేదని మండిపడ్డారు.

అక్రమ సంపాదన, హింసలతో అధికారం తెచ్చిపెట్టుకున్నారని పవన్ ఆరోపించారు. జగన్ నుంచి రాయలసీమ ఏదో ఒక రోజు విముక్తి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమాను జగన్‌తో చేయాలనుకుంటే రాజస్థాన్ ఇసుక ఏడారులు అవసరం లేదన్నారు. ఏపీ నదుల నుంచి తవ్వి తీసిన ఇసుక కలెక్షన్ పాయింట్లలో ఎడారి అంత ఇసుక ఉందని అక్కడే తీసుకోవచ్చన్నారు. ప్రజాధనంతో అత్యంత విలాసవతమైన జీవితాన్ని గడిపే జగన్.. అందర్నీ పేదవాళ్లను చేసి.. తానే వాళ్లను బతికస్తున్నట్లుగా రేషన్ బియ్యం, పథకాల పేరుతో కొంత డబ్బు ఇచ్చి కవరింగ్ చేసుకుని క్లాస్ వార్ అంటున్నారని పవన్ మండిపడ్డారు.


జగన్ లేనప్పుడు వారంతా ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. ఇప్పుడు జగన్ వారందరి ఉపాధిని దెబ్బకొట్టి ప్రభుత్వం మీద ఆధారపడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను లేకపోతే పథకాలు రావని బెదిరిస్తున్నారని,,. దీనికి క్లాస్ వార్ అని పేరు పెట్టుకున్నారని పవన్ మండిపడ్డారు.

బాపట్లలోని నిజాంపట్నంలో మంగళవారం నిర్వహించిన మత్స్యకార భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ ..చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేశారు. పొత్తులు.. తెగదెంపులు.. వివాహాలు , విడాకులు అంటూ సెటర్లు వేశారు. ఈ నేపధ్యంలో జగన్ కు కౌంటర్ గా పవన్ ట్వీట్ చేసినట్లు అర్ధమవుతోంది.

Related News

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Big Stories

×