Bhuma akhila priya news(AP breaking news today): ఆళ్లగడ్డలో హైటెన్షన్ నెలకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఏవీ సుబ్బారెడ్డి పై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక వాహనంలో నంద్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మంగళవారం రాత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై.. అఖిలప్రియ వర్గీయులు దాడిచేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల మండలం కొత్తపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిపై నంద్యాల పోలీసులకు ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.
పోలీసులు అఖిలప్రియతోపాటు 11 మందిపై కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయమే ఆళ్లగడ్డలోని అఖిల ప్రియ ఇంటికి భారీగా పోలీసులు చేరుకుని ఆమెను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.