Big Stories

18 People died in Gaza: గాజాలో దారుణం.. ఆహారం కోసం వెళ్లి 18 మంది మృతి (VIDEO)

Israel-Hamas war

- Advertisement -

Israel-Hamas War: గాజాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్-హమాన్ యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహార సంక్షోభం నెలకొనండంతో ఎయిర్ డ్రాప్ ద్వారా జారవిడిచిన ఆహారాన్ని అందుకునేందుకు వెళ్లి 18 మంది మృతి చెందారు. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతిని వెల్లడించాయి.

- Advertisement -

గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో గాజా నగరంపై ఇజ్రాయెల్ దళాలు విరుకుపడ్డాయి. దీని కారణంగా వందలాది మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులు, డ్రోన్ల దాడి కారణంగా గాజా తన రూపురేకలను కోల్పోయింది. దీంతో గాజా ప్రజలు నీరు, తిండి, గూడు లేక రోడ్లపై దయనీయ స్థితిలో ఉన్నారు.

అయితే గాజా ప్రజలు ఆకలి కేకల తీర్చడానికి ఎయిర్ డ్రాప్ ద్వారా ఆహారాన్ని జార విడచగా విషాధం చోటుచేసుకుంది. ప్రపంచ దేశాలు గాజా ప్రజలు దీన స్థితిని చూసి ముందుకు వస్తున్నాయి. దీనిలో భాగంగా అమెరికా సముద్ర తీరంలో విమానాల ద్వారా డబ్బాలతో ఆహారాన్ని అందించింది. అయితే ఆ ఆహారాన్ని అందుకునేందుకు వెళ్లి 18 మంది మృతి చెందారు.

మృతుల్లో 12 మంది ఆహార డబ్బాలు పైన పడడంతో చనిపోయారు. మిగిలిన వారు సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ విషాధ ఘటన ఉత్తర గాజాలోని బీచ్ లాహియా బీచ్ లో చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారికంగా ధృవీకరించింది.

Also Read: Miss Universe 2024: సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. మిస్ యూనివర్స్ పోటీల్లోకి ఎంట్రీ..

అయితే ఘటనపై పెంటగాన్ కూడా స్పందించింది. మనవతా సాయం కింద అమెరికా గాజా ప్రజలకు 18 బండిల్స్ ద్వారా ఆహారాన్ని అందించగా అందులో మూడు పారాచుట్లు పనిచేయాలేదని వెల్లడించింది. దీంతో అవి అదుపుతప్పి నీటిలో పడిపోయాయని.. వాటిని చేజిక్కించుకునేందుకు వెళ్లి వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News