BigTV English

Pawan kalyan : ఏపీలోనే షూటింగ్స్.. పాలిటిక్స్ పై పవన్ ఫుల్ ఫోకస్..

Pawan kalyan :  ఏపీలోనే షూటింగ్స్..  పాలిటిక్స్ పై పవన్  ఫుల్ ఫోకస్..

Pawan kalyan latest news(Andhra pradesh today news): ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు…! జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండింటిని ఒకేసారి మ్యానేజ్‌ చేస్తున్నారు. ఇక నుంచి ఏపీలోనే పవన్‌ పూర్తిస్థాయిలో ఉండనున్నారు. అలాగే ఆయన చేతిలో ఉన్న సినిమాలను కూడా విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల షూటింగ్స్‌ నిర్వహిస్తామని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా హరీష్‌ శంకర్‌ కూడా ఇదే మాట అన్నారు. మంగళగిరి సినిమా షూటింగ్ లకు అనుకూలంగా ఉందని తెలిపారు.


రాజకీయాలు, సినిమాలు రెండింటినీ ఒకేసారి మ్యానేజ్ చేయడం చాలా కష్టం. చాలామంది సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు జరిగింది ఇదే. కానీ పవన్ మాత్రం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఏకంగా 4 సినిమాలు ఉన్నాయి.

మొన్నటి వరకు సినిమా షూటింగ్ లలో బిజీగా గడిపిన పవన్‌ బుధవారం నుంచి వారాహి యాత్రతో ఫుల్‌ బిజీ కాబోతున్నారు. ఈ యాత్ర ప్రారంభం అయ్యే ముందే ఆయన మహాయాగాన్ని చేపట్టారు. ఈ యాగానికి పవన్ తో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలు హాజరయ్యారు. జనసేనాని తలపెట్టిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వాలని శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో పవన్‌ పొలిటికల్ టూర్ నేపథ్యంలో ఇక తమ సినిమా షూటింగ్స్‌ విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నిర్వహిస్తామంటున్నారు.


మరోవైపు జనసేనలో సినీరంగానికి చెందిన వారు చేరడం ప్రారంభించారు. తాజాగా ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ జనసేనలో చేరారు. ఆయన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రసాద్ కు కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ అత్తారింటికి దారేది చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాదే నిర్మాత. గతంలో ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి చూపించని ఆయన ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Related News

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Big Stories

×