BigTV English

Telangana BJP New President: మారిన లెక్కలు.. తెలంగాణ బీజీపీకి కొత్త అధ్యక్షుడు ఎవరంటే..

Telangana BJP New President: మారిన లెక్కలు.. తెలంగాణ బీజీపీకి కొత్త అధ్యక్షుడు ఎవరంటే..

కమలం పార్టీ సంస్థాగత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే బూత్‌ స్థాయి నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనుంది. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను హైకమాండ్ నియమించింది. డిసెంబర్‌ లేదా జనవరిలో రాష్ట్ర అధ్యక్ష పదవికీ, జనవరి లేదా ఫిబ్రవరిలో జాతీయ అధ్యక్ష పదవికీ ఎన్నిక జరగే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతలంతా లాబీయింగ్‌ లో బిజీబిజీగా గడుపుతున్నారట.

ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అంశంలో నేతల మద్య కొత్త పాత పంచాయితీలు రచ్చ రేపుతోంది. పాత నేతలకే అధ్యక్ష పదవి ఇవ్వాలని పాత నేతలంతా పట్టుబుడుతున్నారు. దీంతో రాష్ట్ర అధ్యక్షులు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో నెలకొందట. అంతే కాకుండా అధిష్టానం అద్యక్ష పదవి ఎవరికి కట్టబెడుతుందనేది కూడా సస్సెన్స్ గా మారిందట. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికాలం ముగియడంతో.. అధిష్ఠానం పార్టీ సంస్థాగత ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి సారించింది.


గతంలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో నడ్డా పదవి కాలాన్ని పొడిగించారు. ఇక గత ఎన్నికల్లో మోడీ మేనియా పెద్దగా కనిపించకపోయినప్పటకి.. మూడోసారి మోడీ ప్రధానిగా గద్దెనెక్కారు. ప్రధాని పీఠం ఎక్కిన ఆరు నెలల తరువాత సంఘ్ పరివారులు సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీంగ్‌ బూత్‌ నుంచి జాతీయ స్థాయి వరకు జరిగే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈ సంస్థగత ఎన్నికల ప్రక్రియ కోసం అధిష్టానం జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ను నియమించింది. రాష్ట్రానికి సంబంధించి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణను నియమించింది.

Also Read: హరీష్ కు పోటీగానే కేటీఆర్ పాదయాత్ర.. ఎవరు చేసినా చీపుర్లు.. చెప్పులే.. ఎంపీ అరవింద్ ఘాటు కామెంట్స్

సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో.. పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఎన్నికైన లక్ష్మణ్‌ అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. అయా రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలపై నిర్వహించే సమావేశాల్లోనూ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్థేశం చేస్తున్నారు. ఇక తెలంగాణలోను కూడా సంస్థాగత ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి 30 వరకు బూత్‌ కమిటీలను వేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బూత్ కమిటీలు పూర్తి అయిన వెంటనే అధిష్టానం హస్తీనాలో అన్ని రాష్ట్రాల సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

ఇక సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 21న జాతీయ, 27న రాష్ట్ర, డిసెంబర్‌ 20న జిల్లా స్థాయి సమవేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మండల, జిల్లా కమిటీలు పూర్తి అయిన తరువాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారట. డిసెంబర్ లేదా జనవరి చివరికల్లా తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్ర అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలనే యోచనలో హైకమాండ్ ఉందట. ఆ తరువాత జనవరి చివరకు లేదా ఫిబ్రవరి మొదటి వారం కల్లా జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. పార్టీ సంస్థాగత ఎన్నికలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ తీవ్రస్ధాయిలో నెలకొందట. జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకుని స్థానికంగా చక్రం తిప్పాలని ఆయ జిల్లాలకు చెందిన నేతలు ఆరాటపడుతున్నారనే చర్చ జరుగుతోందట.

రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతల్లో ఇప్పటికే పంచాయితీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దాటిపోయిందట. తమ తమ స్థాయిలో నేతలు అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్‌ మొదలు పెట్టారనే చర్చ ఆ పార్టీ లోనే కొనసాగుతోంది. పార్టీ సభ్యత్వ నామోదు చేయించడంలో ముందుకు రానీ నేతలంతా పదవుల కోసం మాత్రం ఒకరికి మించి ఒకరు లాబీయింగ్ లు చేసుకోవడం పట్ల సొంత పార్టీ శ్రేణుల నుంచి అసహనం వ్యక్తమవుతోందట. రాష్ట్ర అద్యక్ష పదవి బీసీలకు కట్టబెట్టాలని డిమాండ్లు బలంగా వినిపిస్తుంటే.. బంగారు లక్ష్మణ్‌ తరువాత దళితులకు రాష్ట్ర పగ్గాలు దక్కలేదని.. ఈసారి దళితులకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ సామాజిక వర్గం నేతలు సైతం డిమాండ్‌ చేస్తున్నారట. మరోవైపు ఈ అధ్యక్ష పదవి కోసం కొత్త పాత నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది? పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా ఉన్న నాయకుడికే పగ్గాలు ఇస్తారా..? బీసీ నేతకు ఇస్థారా..? లేక ఎస్సీ సామాజిక వర్గానికిస్తారా..? లేక కొత్త నేతకిస్తారా లేదా పాత నేతలకే ఛాన్స్ ఇస్తారా..? అనే అనేక సందేహాలు పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×