BigTV English

Janasena Chief: పవన్ కళ్యాణ్‌కు స్వల్ప అస్వస్థత..

Janasena Chief: పవన్ కళ్యాణ్‌కు స్వల్ప అస్వస్థత..
Janasena Chief Pawan kalyan latest news
Janasena Chief

Pawan kalyan latest political news(Political news in AP): ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి షెడ్యుల్‌ను కూడా వాయిదా వేయలేదు.


Also Read: అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం.. చంద్రబాబు సంతాపం

ముందుగానే అనుకున్న షెడ్యూల్‌ను వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన హాజరయ్యారు. తన ఆరోగ్యం సహకరించకున్నా చికిత్స తీసుకుంటూనే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ తరనుణంలో పార్టీల శ్రేణులకు ఎన్నికల ప్రచారం, గెలుపు ఓటములపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.


Also Read: అవనిగడ్డ సీటు ఆయనదే, ఎందుకంటే..?

ఆదివారం సాయంత్రం అత్యవసర సమావేశం కోసం హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఉదయం తిరిగి మళ్లీ పిఠాపురం చేరుకోనున్నారు జనసేనాని. ఆరోగ్యం సహకరించకపోయినా మరో రెండు రోజులు పర్యటన చేస్తారని జనసేనా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే జనసేనాని అస్వస్థతకు గురి కావడంతో జనసేన నేతలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రియతమ నాయకుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తున్నారు.

ఏపీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేనా పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పార్టీలు కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పొత్తు కూడిన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు అధికారాన్ని దక్కించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు వైసీపీ కూడా ప్రచారంలో జోరు పెంచింది. సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో కలిసి సెల్ఫీలు దిగుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు.

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×