Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటో చూపిస్తున్నామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేవలం పదం కాదన్నారు. డబుల్ పవర్ అని చెప్పుకొచ్చారు. డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు వేగంగా పూర్తి అవుతాయన్నారు.
గురువారం రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటో చూపిస్తున్నామని చెప్పకనే చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేవలం పదం కాదన్నారు. డబుల్ పవర్ అని మనసులోని మాట బయటపెట్టారు.
డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు వేగంగా పూర్తి అవుతాయన్నారు. ఏపీలో బలమైన ప్రభుత్వం ఉన్నా, కేంద్రం అలాగే ఉంటే మరింత బలంగా పని చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజన్ పవర్ కనిపిస్తోందన్నారు డిప్యూటీ సీఎం.
రాజమహేంద్రవరం అంటే గుర్తుకు వచ్చేది గోదావరి తీరమని అన్నారు. తీరం వెంబడి నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మించిన నేల అని తెలిపారు. ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మించిన నేల అని తెలిపారు.
ALSO READ: జగన్ ర్యాలీలను నిషేధించాలి? ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
450 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. అందులో కీలకమైంది ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టని తెలిపారు. 2024 ఎన్నికల సమయంలో ఈ ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రణాళికలు రెడీ చేసిందన్నారు. దశాబ్దాల నాటి ప్రజల కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతోందన్నారు.
టూరిజంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యటకులు పెరిగే అవకాశముందని తెలిపారు. మంత్రి దుర్గేష్ ఆధ్వర్యంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహకారంలో ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టు ద్వారా 35 లక్షల మంది పర్యాటకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి సహకారం మరిచిపోలేదని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే దానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కారణమని అసలు విషయం బయటపెట్టారు. ఏపీ అభివృద్ధికి ఆయన ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా పర్యటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుతున్నట్లు తెలిపారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే శక్తివంతమైన నాయకత్వం: పవన్ కళ్యాణ్
రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం
ఎంతోకాలంగా ఉన్న కలను కూటమి ప్రభుత్వంలో కేంద్ర సహకారంతో సాకారం చేయడం ఆనందదాయకం
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ https://t.co/Gpfa8kmJkc pic.twitter.com/ERVn6p0ULk
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2025