Tollywood Comedian: ఫ్యాన్స్ అందు మెగాస్టార్ ఫ్యాన్స్ వేరయా.. అంటే అతిశయోక్తి లేదు. ఒక ఇంట్లో చిన్న పిల్లాడి నుంచి ముసలి తాతవరకు అందరూ చిరుకు ఫ్యాన్సే. కేవలం అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ఆయనకు ఫ్యాన్సే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తవారి నుంచి స్టార్ హీరోల వరకు ఆయనను కలిసే మూమెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మూమెంట్ ను లైఫ్ టైం అచీవ్ మెంట్ గా కూడా ఫీల్ అవుతారు.
ఇక చిరుకు ఫ్యాన్స్ కాదు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి డై హార్ట్ ఫ్యాన్స్ లో టాలీవుడ్ కమెడియన్ శివారెడ్డి ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. తన కెరీర్ మొత్తంలో వచ్చిన అవార్డుల మధ్యలో చిరంజీవి తాగి పక్కన పెట్టిన టీ కప్పును.. ఒక పెద్ద అవార్డుగా పెట్టుకొచ్చాడు.
Actress Vijayashanthi: తల్లితండ్రి లేరు.. పెళ్లి చేసేవారు లేరు.. విజయశాంతి ఎమోషనల్
ఇక దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ” ఇన్ని అవార్డుల మధ్య ఈ టీ కప్పు ఏంటి.. ? అనే డౌట్ రావచ్చు. అది మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తాగిన టీ కప్పు. ఆయన టీ తాగిన కప్పులో స్టార్ పెట్టి.. మెగాస్టార్ గుర్తుగా నేను పెట్టుకున్నాను. లక్ష రూపాయలు ఇచ్చినా ఈ కప్పు మాత్రం ఎవరికి ఇవ్వను. అన్నయ్య సగం తాగారు నేను లాగేసుకొని మిగతా టీ నేను తాగి అందులో స్టార్ పెట్టి అలాగే గుర్తుగా పెట్టుకున్నా.. ఏ ఏడాదిలో తీసుకున్నానో గుర్తులేదు. దాదాపు 20 ఏళ్లు అవుతుంది.. నాకు వచ్చిన మొదటి అవార్డ్ పక్కన ఈ కప్పును పెట్టుకున్నాను.. మెగాస్టార్ కప్పు అది” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన మెగా అభిమానులు.. అది చిరంజీవి అభిమానులు అంటే.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.