PM Modi – Pawan Kalyan : మోదీ, పవన్ కల్యాణ్. పరస్పర అభిమానం, గౌరవం. దేశ్‌కీ నేతగా మోదీని తెగ అభిమానిస్తారు జనసేనాని. సిసలైన ప్రజా నాయకుడిగా పవన్ కల్యాణ్‌పై ఎనలేని ప్రేమ చూపిస్తారు ప్రధాని. వారిద్దరి బంధం ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటితమైంది. గతేడాది కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. పవన్ కల్యాణ్ అడిగారని వేదికపై చిరంజీవిని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ ఫోటోలు దిగారు మోదీ. తన ప్రసంగంలో పవన్‌ను ప్రత్యేకంగా పొగుడుతుంటారు కూడా.
వేదికపై వారెవా..
లేటెస్ట్‌గా అమరావతి 2.0 వేదికపై అలాంటిదే మరో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. పున: ప్రారంభబోత్సవం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోదీ గురించి, రైతుల గురించి, అమరావతి గురించి భావోద్వేగంతో మాట్లాడారు. వైసీపీపై విరుచుకుపడ్డారు. ప్రసంగం పూర్తి చేసి.. వెళ్లి తన స్థానంలో కూర్చోబోతుండగా జరిగింది ఆ ఆసక్తికర ఘటన.
పవన్‌కు మోదీ గిఫ్ట్
పవన్ కల్యాణ్ తన ఛైర్‌లో కూర్చుంటుండగా.. మోదీ ఆయన్ను దగ్గరకు రమ్మంటూ పిలిచారు. ఏంటా అని వినయంగా ప్రధాని దగ్గరకు వెళ్లారు పవన్. వెంటనే తన జేబులోంచి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ తీసి పవన్ చేతిలో పెట్టారు. ఆ బహుమతి చూసి పవన్, చంద్రబాబుతో సహా వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. మోదీ ఇచ్చిన గిఫ్ట్‌కు ఖుషీ అయిన జనసేనాని.. ప్రధానికి కృతజ్ఞతగా నమస్కారం చేసి వెళ్లి తన సీట్లో తాను కూర్చున్నారు.
మోదీ ఏం ఇచ్చారు?
ఇంతకీ పవన్‌కు మోదీ ఏం ఇచ్చారు? ఆ బహుమతి ఏంటి? ఖరీదైనదా? అపురూపమైనదా? విలువైనదా? అదేంటో తెలుసుకోవాలని ఆ వీడియోను పదే పదే చూస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఆ వీడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు మోదీ చాక్లెట్ ఇచ్చారంటూ చాలామంది కన్ఫామ్ చేస్తున్నారు. అదన్న మాట మేటర్.
మోదీకి చంద్రబాబు సత్కారం
అంతకుముందు, అమరావతి రీలాంఛ్‌కు విచ్చేసిన ప్రధాని మోదీని వేదికపై ఘనంగా సన్మానించారు ఏపీ సీఎం చంద్రబాబు. ధర్మవరంలో తయారు చేసిన కలంకారీ అంగ వస్త్రంతో సత్కరించారు. మోదీ ఫోటోతో, అమరావతి థీమ్‌తో ఉన్న మెమెంటోను మోదీకి బహుకరించారు చంద్రబాబు.
Also Read : చంద్రబాబును చూసే నేర్చుకున్నా.. బాబును తెగపొగిడేసిన మోదీ
Also Read : మోదీ బిగ్ గేమ్ ఛేంజర్.. చంద్రబాబు చెప్పింది వింటే..
Also Read : లోకేశ్ భలే మాట్లాడారే.. మోదీ మెచ్చుకోవాల్సిందే..