BigTV English

Pawan Kalyan: వారాహిపై సేనాని.. డేట్ ఫిక్స్.. ఇక జగన్‌కు దేత్తడి!

Pawan Kalyan: వారాహిపై సేనాని.. డేట్ ఫిక్స్.. ఇక జగన్‌కు దేత్తడి!
pawan varahi jagan

Pawan Kalyan: పవన్ కల్యాణ్.. ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి వారాహిలో జనంలోకి వస్తున్నాడు. అన్నవరం నుంచి అమలాపురం వరకు.. పవన్ కల్యాణ్ యాత్ర సాగనుంది. పార్టీ నాయకులు, పవన్ అభిమానుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు.. అక్కడి సమస్యలపై అక్కడే మాట్లాడే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు నాదేండ్ల తెలిపారు.


జూన్ 14 నుంచి వారాహి యాత్ర మొదలుకానుంది. గోదావరి జిల్లాల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని. అన్నవరం దర్శనం తర్వాత.. పత్తిపాడు నుంచి యాత్ర మొదలు కానుంది.

పవన్ కల్యాణ్ చేపట్టబోయే యాత్ర ఏర్పాట్లపై ఉభయ గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశమై చర్చించారు. స్థానికుల నుంచి సమస్యలపై పవన్ కల్యాణ్ అర్జీలు తీసుకుంటారని, సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఆయన పర్యటిస్తారని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. మెయిన్ జంక్షన్లు, ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే సభల్లో జనసేనాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేలా ప్లాన్ చేస్తున్నారు.


మొదటి విడతలో తూర్పుగోదావరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. ఆ తర్వాత వెస్ట్ గోదావరిలో పర్యటన ఉంటుంది. సినిమా షూటింగ్స్ పూర్తైతే.. ఇక కంప్లీట్‌గా ప్రజల్లోనే ఉండనున్నారు పవన్ కల్యాణ్.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×