Big Stories

Electricity from humidity in air: గాలిలోని ఆవిరితో కరెంటు తయారీ.. కొత్త టెక్నాలజీతో..

Electricity from humidity in air : ఈరోజుల్లో కరెంటు అవసరాలు పెరిగిపోతున్నాయి. కానీ దానికి తగినట్టుగా కరెంటు మాత్రం ఉత్పత్తి కాలేకపోతోంది. అందుకే శాస్త్రవేత్తలు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. కరెంటు తయారీ విషయంలో కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటున్నారు. అసలు ఇలాంటి వాటితో కరెంటు తయారీ సాధ్యమా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా గాలిలోని ఆవిరితో కూడా కరెంటు తయారీ చేస్తామని శాస్త్రవేత్తలు బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

- Advertisement -

ఒక కొత్త రకమైన టెక్నాలజీతో గాలిలోని ఆవిరితో కరెంటు తయారీ సాధ్యమని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మెటీరియల్‌తో సంబంధం లేకుండా గాలిలోని ఆవిరి కరెంటుగా మార్చడం చాలా సులభమని వారు తెలిపారు. కాకపోతే ఆ మెటీరియల్‌లో నానోపోర్స్ కలిగి ఉండాలన్నారు. ఒక డయామీటర్‌లో 100 నానోమీటర్స్ ఉండాలని చెప్పారు. గాలిలో ఎక్కడా లేనంత కరెంటు ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. కానీ దానిని పూర్తిస్థాయిలో కరెంటు రూపంలో మార్చాలంటే టెక్నాలజీ అవసరం ఉంటుందన్నారు.

- Advertisement -

ఒక మేఘాన్ని తీసుకుంటే అందులో చాలా నీటి బిందువులు ఉంటాయి. అందులోని ప్రతీ నీటి బొట్టులోనూ కరెంటు ఉంటుంది కానీ దాని నుండి కరెంటును ఉత్పత్తి చేసే మార్గం మనకు తెలియదన్నారు. దానిని కనిపెట్టడం కోసమే శాస్త్రవేత్తలు కృత్రిమంగా ఒక మేఘాన్ని తయారు చేశారు. దాని నుండి కరెంటు తయారీ ఎలా సాధ్యమని పరీక్షలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నానోవైర్స్‌తో ఉన్న మెటీరియల్ ద్వారా గాలిని కరెంటుగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ ఆ పరిశోధనలు ముందుకు కొనసాగలేదు.

నానోమీటర్స్ ఉన్న మెటీరియల్ ద్వారా గాలిలోని ఆవిరితో కరెంటు తయారు చేయవచ్చని తెలుసుకున్న తర్వాత.. శాస్త్రవేత్తలు ముందుగా ఆ మెటీరియల్ తయారీలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఎలక్ట్రానిక్ హార్వెస్టర్‌ను కనిపెట్టారు. ఇది చిన్న చిన్న నానోపోర్స్‌తో తయారు చేయబడింది. ఇందులో ఆవిరి అనేది మెల్లగా పై నుండి కిందకి జారుతుంది. ఇలా ఒక ప్రక్రియలో వెళ్లిన తర్వాత అది కరెంటుగా మారుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో కరెంటు మాత్రమే కాకుండా బ్యాటరీ కూడా తయారు చేయవచ్చని వారు బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రయోగాలు ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News