Pawan Kalyan wife Anna: ఏపీ డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమలకు వెళ్లారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అక్కడి నుంచి ప్రత్యేక కారులో నేరుగా తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు అన్నా లెజినోవా. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించు కుంటారు.
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురయ్యాడు. గాయాలతో బాబు బయటపడ్డాడు. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు పవన్ కల్యాణ్ దంపతులు. సాయంత్రం హైదరాబాద్ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు అన్నా లెజినోవా. ఆదివారం రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. శ్రీవారి దర్శనానికి ఆమె ఒక్కరే వచ్చారు.
కొడుకు మాత్రం హైదరాబాద్‌లో తండ్రి వద్ద ఉన్నారు. మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడటంతో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నారు. సింగపూర్ ఘటన జరిగిన నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని కోరుకున్నారట.
ఎలాంటి అపాయం జరగకుండా ఉంటే తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కకున్నారట. శ్రీవారు కరుణించడంతో ఆమె మొక్కు తీర్చుకుంటున్నారు. పవన్ భార్య అన్నా స్వతహాగా క్రిస్టియన్. కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వరస్వామికి దర్శించుకోవడానికి రావడం విశేషం.
ALSO READ: రాజకీయాల్లోకి వస్తున్నా- మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటన
తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అనా కొణిదల గారు.
రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు. pic.twitter.com/pjBnsZCOJz
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2025