Ayurveda for Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే అది స్ఫటికాలుగా మారుతుంది. ఈ స్ఫటికాలు కీళ్లలో చేరి వాపు, నొప్పి, కీళ్ల నొప్పులకు దారితీస్తాయి. అంతేకాకుండా దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ కారణంగా గౌట్, కిడ్నీలలో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఇప్పటికే ఇది అధికంగా ఉంటే దీన్ని తగ్గించుకోవడం కూడా ముఖ్యం.
దీని కోసం ఆయుర్వేదంలో కొన్ని పద్దతులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని తగ్గించడంలో సహాయపడే కొన్ని సాధారణ ఆయుర్వేద మార్గాలు ఏంటంటే..
ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల శరీరంలో నుండి అదనపు యూరిక్ యాసిడ్ బయటకు పోతుందట. అందుకే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి.
కంచెల దగ్గర కనిపించే తిప్పతీగ యూరిక్ యాసిడ్‌ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుందట. అంతేకాకుండా శరీరంలోని వాపు, మంటను తగ్గించడంలో సహాయం చేస్తుందట.
తులసి ఆకులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. తులసి తీసుకోవడం యూరిక్ యాసిడ్‌ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా గౌట్ ఎటాక్ అవ్వకుండా కాపాడడంలో కూడా ఇది సహాయం చేస్తుందట.
అల్లం సహజసిద్ధంగానే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలతో సంబంధం ఉన్న కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని నేచురల్‌గా డీటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది.
ALSO READ: చేతి గోళ్లు విరిగిపోతున్నాయా..?
పసుపులో కర్కుమిన్ ఉంటుంది.ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కర్కుమిన్ సహాయపడుతుందట. అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
వాత, పిత్త దోషాలను తగ్గించడానికి ప్రసిద్ధి చెందిన అశ్వగంధ ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్, షెల్ ఫిష్, చికెన్ వంటి వాటిలో ప్యూరిన్స్ అధికంగా ఉంటాయట. వీటిని తరచుగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే వీలైనంత వరకు వీటిని తక్కువగా తీసుకోవడం ఉత్తమం.