Virgin Australia Plane Safe Landing: వర్జిన్ ఆస్ట్రేలియా విమానానికి పెద్ద ముప్పు తప్పింది. పక్షి ఢీ కొట్టడంతో విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. వర్జిన్ ఆస్ట్రేలియా విమానం బోయింగ్ 737-800 నెంబరు విమానం 67 మంది ప్రయాణికులతో న్యూజిలాండ్ నుంచి మెల్‌బోర్న్ వెళ్లేందుకు సిద్ధమైంది. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విమానం టేకాఫ్ అయ్యింది. గాల్లోకి ఎగరగానే పక్షి విమానాన్ని ఢీ కొట్టింది.
అది నేరుగా విమానం ఇంజన్‌లోకి వెళ్లడంతో ఒక్కసారి మంటలు చెలరేగాయి. వెంటనే పరిస్థితి గమనించిన పైలట్, ఇన్వెర్కాగిల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. వెంటనే అలర్టయిన ఫైర్ ఇంజన్లు విమాన మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి నుంచి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చారు ఎయిర్‌పోర్టు అధికారులు.
Also Read: Rishi Sunak: ఎన్నికల వేళ ట్రోలవుతున్న రిషి సునాక్.. కారణమిదే
#BREAKING #AUSTRALIA #NewZEALAND #Aviation #Aviacion #Boeing737 #Accident #Accidente
🔴 NEW ZEALAND :📹 EMERGENCY LANDING IN NZ AFTER ENGINE FIRE
A Virgin AUSTRALIA Boeing 737-800 bound for MELBOURNE made an emergency landing in Invercargill, NZ due to an engine fire,… pic.twitter.com/KQjhWnWZwK
— LW World News 🌍 (@LoveWorld_Peopl) June 17, 2024